జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==తొలి జీవితం==
జయంతి [[కర్ణాటక]] లోని [[బళ్ళారి]]లో జన్మించింది. తండ్రి బాలసుబ్యమణ్యం [[బెంగుళూరు]]లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి [[మద్రాసు]] చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలని కాంక్ష. [[మద్రాసు]]లో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద [[నాట్యం]] నేర్చుకోసాగింది. ఒకనాడు [[కన్నడ]] సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్థినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' (''Jenu Goodu'') అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan">{{cite news
| last = Fernandes
| first = Ronald Anil
పంక్తి 15:
| accessdate = 2006-12-24 }}</ref>
 
బడి పిల్లలతో కలిసి [[మద్రాసు]]కు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ [[ఎన్.టి.రామారావు]] కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి [[జగదేకవీరుని కథ]] [[కులగౌరవం]], [[కొండవీటి సింహం]], [[జస్టిస్ చౌదరి]] చిత్రాలలో [[ఎన్టీఆర్]] సరసన నాయికగా[[నాయిక]]<nowiki/>గా నటించారు.
 
==సినిమా జీవితం==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు