బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
 
===మహా రాజ హరి సింగు సమశ్యలు ===
రెండవప్రపంచయుద్ద సమయమున అనేక వేలమంది జమ్ము కాశ్మీర సంస్థానపు యువకులను భారత సైనిక సిబ్బందిలో చేర్చుకునియుండిరి. వారి వారి దగ్గరయున్న ఆయుధములను ప్రభుత్వమునకప్పగించమని హెచ్చిరికచేయ బడెను. కానీ స్పందన లభించలేదు అంతేగాక ఆగస్టు 14 తేదీనుండీ స్వతంత్ర పాకిస్తాన్ దేశపు జండాలు ఎగురవేయబడెను. పాకిస్థాన్ ఆవతరణ సంధర్బముగా వేడుకలు జరుపుకొనిరి. జమ్మూ కాశ్మీరు లోని పూంచి-మీర్పూర్ పరగణాలలో పుట్టిన తిరుగుబాటు నణచుటకు మహారాజు తన సైన్యము నంపగా అచ్చట తిరుగుబాటు దారులైన కొద్దిమందిపైన కసితీర్చుటకు అమాయక మహ్మదీయుల గృహములు, గ్రామమములు తగులబెట్టుట , హతమార్చుట మొదలగు, సైనిక దుష్చర్యలు జరిగియుండెను. ఆ సంఘటనాంతరము అనేకవేల మహ్మదీయులు పశ్చమ పంజాబు కు వలసపోయిరి. మహారాజ హరి సింగు నిరంకుశత్వమును నిరసించిన కొందరి ముఠాలతో ముస్లిం కానఫరెన్సు రాజకీయ పార్టి చేతులుకలపి మాజీ సైనికులు కలసియున్న అజాద్ ఫౌజ్ అను మరియొక పార్టి నెలకొల్పబడినది. మాజీసైనికులైయుండిన ఆ పార్టి శ్రీనగరుని ముట్టడించుటకు కుట్రలుపన్ని చుట్టుపక్కలనుండిన అడవి-కొండ జాతి ముఠాలను చేర్చుకునిరి. వారికి సైనిక తర్ఫీదుతో ఆయుధములు ఆయుధ సామగ్రీ సరఫరాచేసి వారికి సహయ సహకారమిచ్చుటకు పాకిస్థాన్ ప్రదానమంత్రి లియాక్వత్ అలి ఖాం నేతృత్వములో పాకిస్థాన్ సైనికాధికారికి భాద్యత ఇచ్చియుండెను. పూంచి పరగణాలలో జరిగినట్టి విద్రోహక చర్యలు వార్తాపత్రికలు ప్రకటించియుండిన చరిత్రాంశములైనవి. ఆ సంస్థానమునకు ఆఖరు బ్రిటిష్ ముఖ్య సైనికాధికారి మేజర్ జనరల్ స్కాట్. అతని తరువాత వచ్చిన ఆధికారి బ్రిగేడియర్ రాజీందర్ సింగు భారతదేశవైపు సానుభూతి గలవాడు. మహారాజు సెప్టెంబరు మాసములో పాకిస్తాన్ గవర్నర జనరల్ మహ్మద్ అలి జిన్నాహను కలుసుకొనుటకు నిరాకరించుటవల్ల హరిసింగుపై పాకిస్తాన్ అధికారుల వైషమ్యింకనూ వృధ్ది పొందెను. పాకిస్తాన్లోని పశ్ఛమ పంజాబునుండి కాశ్మీరుకు రవాణారాకపోకలు నిలుపివేయబడినవి. పెరుగుచున్న విద్రోహక చర్యలమధ్య, మహారాజ హరి సింగుకు తగిన సమర్ధన ముండవలెనన్నచో సంస్థానములో విపక్ష రాజకీయపార్టీ అగు నేషనల్ కానఫరెన్సుపై మహారాజు హరిసింగు సానుభూతిగ నుండినచో మహారాజుకు తగిన మదత్తు కలుగునని నెహ్రు సలహా యిచ్చియుండెను. ఆ సలాహ ప్రకారము 1945 నుండీ నిర్భందము లో నుంచబడియున్న ఆ పార్టీ నాయకుడైన షైక అబ్దుల్లాను సెప్టెంబరు 29 న విడుదలచేశెను. అప్పటినుండీ మహరాజు యొక్క సార్వభౌమత్వమును సిరసావహించిన షైక అబ్దుల్లా రాజ్యములోని విద్రోహక చర్యలనరికట్టుటకు కృతనిశ్చ యుడైయ్యను. అటుతరువాతనుండి జరిగిన షైక అబ్దుల్లా-నెహ్రూ చర్చలు జమ్మూ కాశ్మీరు సంస్థానము భారతదేశములో విలీనమగుటకు దోహదముచేశను. కాని అక్టోబరు మాసము నుండి కాశ్మీరు లో విద్రోహక చర్యలు అధికమై పరిస్థితులు విషమిస్తున్నవి. మహారాజు తన ప్రధాన మంత్రిని అక్టోబరు 15 తారీకు మరో సారి మార్చి భారతదేశమున న్యాదీశుడిగ చేసిన మెహర్ చంద్ మహాజన్ ను నియమించెను. పాకిస్థాన్లో విలీనమవమని వెంటాడుతున్న పాకిస్తానీ అధికారిని శ్రీనగరులోనుండివెడలమని కొత్త ప్రధానమంత్రి ప్రభుత్వ ఉత్తర్వులు చేసియుండెను. శ్రీనగర్ జమ్ము- కాశ్మీరు సంస్థానముయొక్క ప్రభుత్వ యంత్రాంగము యుండిన పట్టణము.
 
===ర్యాడ్ క్లిఫ్ గీతను తుడిచిపెట్టుటకు ప్రయత్నించిన పాకిస్ధాను===
విద్రోహక చర్యలు చేసి మహరాజ హరి సింగును కూలద్రోయు ప్రయత్నములు అచ్చటి ఆందోళనకారులైన అజాద్ ఫౌజు సభ్యులద్వారానే కాక పాకిస్థాన్ లోనుండిన ముస్లిం నేషనల్ గార్డు లనబడిన మాజీ సైనికుల వ్యవస్త ద్వారాకూడా చేయబడియుండెను. అక్టోబరు నెలలో జమ్మూ-కాశ్మీరు సంస్థానములో నుండిన ఉత్తర పశ్చమ ఫ్రంట్ పరగణాలలో విద్రోహక చర్యలు ఉదృతము చేయుటకు ప్రేరేపింపబడినట్లు చరిత్రాంశములు కనబడుచున్నవి. 1947 అక్టోబరు మధ్యనాటికి పూంఛ్ మీర్పూరు పరగణాలలో చాల భాగము అజాద్ ఫౌజుదార్ల అధీనములోనుండినది. ముజఫరాబాదులో మహ్మదీయేతరులు లేకుండా తరిమి కొట్టబడిరి. ర్యాడ్ క్లిఫ్ గీత దాటి ఇండియా డొమినియన్లోకి చొచ్చుకుచ్చిన పాకిస్తాన ఆక్రమణనరికట్టి వెనుకకు మళ్లమన్న జమ్ము-కాశ్మీరు ప్రభుత్వపు ఆరోపణకు మహ్మదాలి జిహన్నా అది వివాదస్పదమైన ఆరోపణమనియూ బయటివారిచేత విచారించుట ఉచితమని పేర్కోనియుండెను. అట్టి పాకిస్థాన్ ఆక్రమణలనరికట్టని పరిస్తితులలో తాను ఇండియా డొమినియన్ సైనిక సహాయము కోరవలసియున్నదని ప్రధానమంత్రి మహాజన్ అక్టోబరు 18న చేసిన తంతికి మహ్మదలి జిన్నాహ ప్రధానమంత్రిని చర్చనిమిత్తము కరాచికి పంపమనియూ , జమ్ము-కాశ్మీరు సంస్థానము ఇండియా డొమినియన్లో చేరుటకు ఇదివక నెపమని ఆరోపించుతూ మహారాజు హరిసింగుకు జవాబు పంపెను.
 
==మూలాలు==