ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
ఈజీషేర్ శ్రేణి డిజిటల్ కెమెరాలతో కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫీ వైపుకు అడుగులు వేసింది. అపరిమిత వనరులను వెచ్చించి మహిళలు డిజిటల్ ఫోటోలను తీయటంలో ఉత్సుకత చూపినను, వాటిని కంప్యూటర్ లలోకి మార్చటంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించింది. ఇది కొడాక్ కు ఎడారిలో ఒయాసిస్ గా ఉపయోగపడినది. డిజిటల్ ఫోటోలను కంప్యూటర్ లో చూచుకొనటానికి పలు ఉపకరణాలను కొడాక్ రూపొందించి. 2005 నాటికి కొడాక్ కెమెరా అమ్మకాలలో 40% వృద్ధి సాధించింది.
 
వృద్ధిలో ముందంజలో ఉన్ననూ, డిజిటల్ కెమెరాల వ్యాప్తిలో వేగాన్ని అంచన వేయటంలో కొడాక్ వెనుకంజ వేసింది. 2000 నాటికి లాభాలను తగ్గించుకొని అధిక సంస్థలు డిజిటల్ ఫోటోగ్రఫీలోకి ప్రవేశించినవి. 2001లో కొడాక్ అమెరికాలోని డిజిటల్ కెమెరా అమ్మకాలలో (సోనీ తర్వాత) రెండవ స్థానంలో నిలిచినది. సంస్థలోని డిజిటల్ మరియు ఫిలిం విభాగాల మధ్య అంతర్గత కలహాలు కూడా ఉండేవి. 2005 నాటికి అధిక లాభాలను అర్జించే ఫిలిం విభాగం లాభాలు 18% క్షీణించినవి. తక్కువ లాభాలకే మెరుగైన ఉత్పత్తులు తయారు చేయగలిగే ఆసియాలోని ప్రత్యర్థులు కొడాక్ ను వెనుకకు నెట్టేశాయి. 1999 నాటికి 27% మార్కెట్ షేర్ గల కొడాక్, 2003 నాటికి 15% తో సరిపెట్టుకొంది. 2007లో 9.6%, 2010కి 7% లకు కొడాక్ మార్కెట్ షేర్ పడిపోయింది. కెనాన్, నికాన్, సోనీలు మార్కెట్ ల పై పెత్తనం చెలాయించటం మొదలైంది. 2000 వ దశాబ్దం ద్వితీయార్థంలో మొబైల్ ఫోన్ల లోనే కెమెరాలు రావటంతో డిజిటల్ కెమెరాలు కూడా సగటు మనిషికి దూరమైపోయాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు