నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
===సైనికాధిపతిగా నెపోలియన్ విజయాలు===
నెపోలియన్ [[ఆస్ట్రీయా]],[[ఇటలీ]] (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలఫ్రదం గా ఉపయోగపడింది. అప్పటివరుకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీ లో రాజకీయపుర్వకమయిన ఐక్యత లోపించివుండింది. అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఎర్పాటుచేసాడు. ఆ పద్దతిలో ఇటలీ లో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రీయా, ఇటలీ (సార్డీనియా) యుద్దాలు నెపోలియన్ యొక్క వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ యొక్క అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
[[ఫ్రాన్స్]] యొక్క శత్రువయిన [[ఇంగ్లాండు]] ను ఓడించాడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్ ను అధిపతి గా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా [[ఇంగ్లాండు]] ఓడించడం కష్టమని, [[ఇంగ్లాండు]] కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే లో దాడిచేసాడు. పిరమిడ్ యుద్దంలో విజయం సాధించినప్పటికి , [[ఇంగ్లాండు]] నౌకధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది.
ఈ పాలకమండలి లో ఐక్య కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని , డైరెక్టరీ కిఅ శాశనసభ కు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘీక ఆర్ధిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. [[ఫ్రాన్స్]] యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్టమయిన , సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ [[ఫ్రాన్స్]] చేరి సైన్యం తో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.
 
===మొదటి కౌన్సిల్ గా నెపోలియన్ సంస్కరణలు===
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు