యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== ప్రారంభ జీవితం, విద్య ==
స్వామినాథన్ 1925 [[ఆగష్టు 7]] న [[తమిళనాడు]]లోని [[కుంభకోణం]]<nowiki/>లో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా [[కుంభకోణం]]<nowiki/>లో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడినది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. [[ఫైలేరియా|ఫైలేరియాసిస్]] అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.
 
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు. <ref>The 1971 Ramon Magsaysay Award for Community Leadership [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm/ "BIOGRAPHY of Moncompu Sambasivan Swaminathan"/] Retrieved on 26 March 2013</ref> వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను [[మహాత్మా గాంధీ]] చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.<ref>[https://m.youtube.com/watch?v=UPHgwdAF-LY MS Swaminathan - On future of Indian agriculture], YouTube</ref> అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.
పంక్తి 34:
ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
 
== వృత్తి జీవితం ==
స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాలలో తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను మద్రాసు వ్యవసాయ కళాశాల (ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) లో చేరి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో మరో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని అతను ఇలా చెప్పాడు: "నేను కేరళ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రేరణ '1974 నాటి బెంగాల్ కరువు' తో మొదలైంది. అప్పుడు తీవ్రమైన బియ్యం కొరత ఉంది. బెంగాల్ లో మూడు మిలియన్ల ప్రజలు ఆకలితో మరణించారు. నాతో పాటు అనేక మంది యువకులు గాంధీతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అపుడు వ్యవసాయ రైతులకు ఎక్కువ ఉత్పత్తి అందించాలనే థ్యేయంతో నేను వ్యవసాయ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను"<ref>SGI Quarterly, A Buddhist forum for peace, culture and education [http://www.sgiquarterly.org/feature2009Jly-6.html/ "An Evergreen Revolution, Interview with M.S. Swaminathan"] Retrieved on 26 March 2013</ref>
 
స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో అతను జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారాడు. 1949లో అతను సైటోజెనెటిక్స్ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం) లో డిస్టింక్షన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అతను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్ష రాసి "ఇండియన్ పోలీసు సర్వీసు" కు ఎంపికయ్యాడు.<ref>996 CURRENT SCIENCE, VOL. 101, NO. 8, 25 October 2011 [http://www.currentscience.ac.in/Volumes/101/08/0996.pdf/ "IN CONVERSATION M. S. Swaminathan" Retrieved on 26 March 2013] {{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> అతను నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళా దుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్.ఐ పరిశోధనను కొనసాగించడానికోసం యునెస్కో ఫెలోషిప్ ను అంగీకరించాడు. సోలానమ్ యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంప (సోలనమ్ ట్యుబరేసం) కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో అతను విజయం సాధించాడు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ లో చదవడానికి వళ్ళాడు. అతను రాసిన "స్పెసీస్ డిఫెరెన్సియేషన్, అండ్ ద నేచుర్ ఆఫ్ పోలీఫ్లోడీ ఇన్ సెర్టయిన్ స్పెసీస్ ఆహ్ ద జెనస్ సోలానం - సెక్షన్ టుబెరారియం" అంశంపై 1952 లో పి.హెచ్.డి డిగ్రీని పొందాడు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ పొందాడు. <ref>[https://web.archive.org/web/20141209123426/http://www.fitz.cam.ac.uk/about/newsitem-4-237 Professor M S Swaminathan is new Honorary Fellow]. Fitzwilliam College. 28 November 2014.</ref>
 
స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధన కు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.<ref name="worldfoodprise.org" />
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లంకెలు ==
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు