నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు.<ref name="NDTV2" /> తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.
=== పార్టీలో ఎదుగుదల ===
1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు వెళ్లినప్పుడు [[నాదెండ్ల భాస్కరరావు]] [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌]]<nowiki/>తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన [[రాంలాల్|రాంలాల్ని]] కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]]<nowiki/>లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడు ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభ్యలోసభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.