వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{under construction}} వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{under construction}}
వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి. ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.<br>
మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
==మూలాలు==
వ్యాసంలో ఒక సమాచారాన్ని నిర్ధారించడానికి ఆధారంగా పనికివచ్చే పుస్తకాలు, వెబ్‌సైట్లు, జర్నల్స్, పత్రికలు, వీడియోలు వంటివాటన్నిటినీ మూలాలుగానే ఈ మార్గదర్శక పేజీ పేర్కొంటుంది. వీటిని ప్రధానంగా మూడుగా విభజించవచ్చు:
;ప్రాథమిక మూలాలు
ఒక అంశానికి నేరుగా సంబంధించిన మూలాలను ప్రాథమిక మూలాలు అనవచ్చు, ఇవి ఆ అంశానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు రాసేవి. ఉదాహరణకు ఒక సంఘటనకు ప్రత్యక్ష సాక్షుల కథనం, ఒక వ్యక్తి ఆత్మకథ, ఒక సందర్భంలో స్థానిక పత్రికా విలేకరి ప్రత్యక్ష కథనం వంటివి ప్రాథమిక మూలాలు. '''ప్రాథమిక మూలాల ఆధారంగా వ్యాసంలో పెద్ద భాగాలను కానీ, విశ్లేషణాత్మకమైన అంశాలను కానీ రాయకూడదు'''. ప్రాథమిక మూలాల నమ్మదగ్గవిగానూ, ఉపయోగకరంగానూ ఉండే సందర్బాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన కాకుండా]] జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో చేసే సూచనలు రెండు.
* ప్రాథమిక మూలాల్లో కనిపించే వర్ణనలు ఒక ఆ అంశంపై లోతైన అవగాహన లేని సామాన్యమైన విద్యావంతుడు స్వయంగా పరిశీలించి నిర్ణయించుకోగలిగిన సందర్భంలో మాత్రమే చేర్చాలి. అలా చేర్చిన సందర్భంలో కూడా ఫలానా వ్యక్తి లేక ఫలానా దస్త్రం ప్రకారం అన్న విషయం స్పష్టంగా రాయాలి.
* ప్రాథమిక మూలాలలోని వర్ణనలు, విశేషాలను ఆధారం చేసుకుని విశ్లేషణలు, అభిప్రాయాలు, వివరణలు చేర్చకూడదు.
;ద్వితీయ స్థాయి మూలాలు
ద్వితీయ స్థాయి మూలాలు ప్రాథమిక మూలాలు, ద్వితీయ స్థాయి మూలాలు వంటివి ఆధారం చేసుకుని తయారుచేసే విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక మూలాలు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షుల కథనాలకు తోడు, గణాంకాలను స్వీకరించి పరిశోధించి నిర్ధారణకు వస్తూ వ్యాసాన్ని రాస్తే అది ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. అలానే ఆత్మకథను