బొడ్డేపల్లి రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
శ్రీకాకుళం జిల్లాలో [[వంశధార]] నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు"గా నామకరణం చేశారు.<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007061453840400.htm&date=2007/06/14/&prd=th& The Hindu on Vamsadhara Project]</ref>
 
అతను శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1923 మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మందలం,అ క్కులపేట గ్రామంలో అన్నపూర్ణమ్మ, సీతారామస్వామి దంపతులకు జన్మించాడు.విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలో విద్యనబ్యసించాడు. కుటుంబానికి పెద్ద కుమారుడు కావటంతో తండ్రి తర్వాత తాళ్లవలస గ్రామ ముససబుగా బాధ్యతలు చేపట్టాడు. తన 29వ యేట 1952లో జరిగిన లోక్‌సభ మొదటి జనరల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ మహానాయకుడు పి.ఎల్.ఎన్.రాజు ను ఓడించి సంచలనం సృష్టించాడు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 2వ, 3వ, 5వ, 6వ, 7వ లోక్‌సభలకు ఎన్నికయ్యాడు. పార్లమెంటు సభ్యులలో ఆనాడు జరిగిన క్రికెట్ పోటీల్లో అసమాన క్రీడా ప్రతిభను ప్రదర్శించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దృష్టిని ఆకర్షించాడు.
 
జిల్లా వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషిచేసాడు. వంసాధార ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య చేత శంకుస్థాపన చేయించాడు. ఆమదాలవలసలో సుగర్ ఫాక్టరీ, పారిశ్రామికవాడ, శ్రీకాకుళంలో పారిశ్రామికవాడ, పారిశ్రామిక శిక్షణా సంస్థల స్థాపనలో ఆయనకృషి మరువరానిది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో కృషి చేసాడు. దీనివలన పరిశ్రమల స్థాపనకు, ఎన్నో రాయితీలు పొందటానికి ఈ జిల్లాకు అవకాశం కలిగింది. జిల్లాలో రాగోలు, చింతాడ, బారువలలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు స్థాపనకు ప్రయత్నించి జిల్లా వ్యవసాయకంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడ్డాడు. జిల్లాలో అధిక సంఖ్యాకులైన కళింగులు అభివృద్ధి చెందిననాడు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని భావించి విరికి రిజర్వేషన్లు కేటగిరీలో చేర్చేందుకు తన వంతు కృషి చేసాడు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీ పటిష్టతకు తోడ్పడ్డాడు. కేంద్ర సహకార బ్యాంకును అధ్యక్షునిగా, సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య అధ్యక్షునిగా పనిచేసి సహకార రంగ అభివృద్ధికి పాటుపడ్డాడు. తన అద్యక్ష పదవీ భాద్యతలు చేపట్టిన నాటికి క్లాస్ బ్యాంకుగా ఉన్న కేంద్ర సహకార బ్యాంకును ఎ. క్లాస్ బ్యాంకుగా అభివృద్ధి పరచాడు.
 
== మరణం ==