గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
సాంప్రదాయ పద్ధతిలో సాధారణంగా రాగి పాత్రలో గులాబీ పూలను,నీటిని తీసుకుని వేడీ చేస్తారు.ఈ స్వేదన క్రియ 50-105 నిమిషాలు వుండవచ్చును.ఆవిరిగా మారిన పూలలోని రసాయనాలు మరియు నీటి ఆవిరి ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళి చల్లబడి, ద్రవీకరణ చెందును.ద్రవీకరణ చెందిన నీటి,నూనె మిశ్రమాన్ని ఒక సెటిలింగు టాంకులో /పాత్ర లో సేకరిస్తారు.నూనె నీటి పైభాగాన ప్రత్యేక మట్టంగా ఏర్పడును. సెటిలింగు పాత్రలో జమ అయిన నీట్లో, నీటిలో కరుగు స్వాభావం వున్న గులాబీ పూల రసాయనాలు కరగి వుండును.ఈ నీరు కొన్ని గులాబీ వాసన కారక రసాయనాలను(పెనే ఇథైల్ ఆల్కహాల్ వంటివి) కలిగి వుండును.అందుచే ఈ నీటిని తిరిగి స్వేదనక్రియచేసి ఆ రసాయన సమ్మేళనాలను వేరు చేసి తిరిగి నూనెలో కలిపేదరు, లేదా నీటిని రోజ్ వాటరు/పన్నీరు గా అమ్మకం చేస్తారు.
===సాల్వెంట్ ఎక్సుట్రాక్సను విధానం===
సాల్వెంట్ ఎక్సుట్రాక్సను విధానంలో కూడా గులాబీ పూల నుండి అత్తరును సంగ్రహిస్తారు.ఈ ప్రక్రియలో [[హెక్సేను]] అను హైడ్రోకార్బను ను ద్రావణిగా ఉపయోగిస్తారు.ఈవిధానంలో నూనెలో సుగంధరసాయన సమ్మేళనాలతో పాటు [[మైనం]] మరియు [[రంగు]] కారకాలు కూడా సంగ్రహింపబడును. ఈసంగ్రహణ సారాన్ని '''కాంక్రీట్ ''' అంటారు.వాక్యూమ్ లో (పీడన రహిత స్థితి )లో సాల్వెంట్+కాంక్రీట్ మిశ్రమాన్ని డిస్టిలుచేసి సాల్వెంట్ను వేరు చేస్తారు,ఇప్పుడు కాంక్రీట్ అనబడే చిక్కని పదార్థాన్ని ఆల్కహాల్ లో 40-50°Cవద్ద కరగిస్తారు.ఇప్పుడు ఆల్కహాల్ మిశ్రమాన్ని -5°C వరకు శీతలీకరణ చేస్తారు.తక్కువ ఉష్ణోగ్రత వద్ద మైనపు పదార్హాలు అవక్షేపంగా ఆల్కహాల్ అడుగు భాగంలో చేరును,పైనున్న ఆల్కహల్ ను జాగ్రత్తగా ఫిల్టరు చేసి సేకరించిన పదార్థాన్ని '''అబ్‌సొల్యుట్ ''' అంటారు.
 
==గులాబీ నూనె వాడకం ముందు జాగ్రత్తలు==
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు