దామెర్ల రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 17:
 
ఆ రోజులలో [[రాజమండ్రి]]లోని ఆర్ట్స్ కాలేజిలో [[ఆస్వాల్డ్ కూల్డ్రే]] అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.
 
 
కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును [[బొంబాయి]]లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని ''మద్రాసీ'' అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుక్న్నారు. నమ్మలేకపోయారు. అమాయకంగా నలుగురిలో కలవక ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై [[మేయో]] బంగారు పతకాన్ని రామారావు పొందాడు. వెంటనే చిత్రకళశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాని స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగివచ్చాడు. [[1922]] లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన 'ఋష్యశృంగ బంధనం' చిత్రానికి ప్రథమ బహుమతిగా 'వైస్రాయి ఆఫ్ ఇండియా' పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి [[లార్డ్ రీడింగ్]] రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు. రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, 'సిద్ధార్థుని రాగోదయం', 'బావి దగ్గర', భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.
 
==చిత్రకళా ప్రతిభ==
 
 
'''సీమంతం''' - 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ ' పుష్పాలంకరణ" ( పువ్వుల ముడుపు) . ఇది ఆంధ్రప్రదేశములో తమ ఇంటి ఆడపడుచులకు తొలికానుపు ముందు చేయు సంబరం. ముతైదువుల సమక్షమున జరుపు ముచ్చటైన వేడుకను ఆయన బార్యకు జరిగిన సీమంతమును చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపమును తన రచనా పాటవముతో చిత్రించాడు. రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు గోచరిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.
 
 
'''బావివద్ద''' - ఆంధ్ర గ్రామీణ వాతావరణ చిత్రీకరణ ఈ చిత్రములో కలదు. గ్రామాలలో గల ఊరుమ్మిడి మంచి నీటి గిలక బావుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచెద్వారా మనకు అద్దము పట్టినట్లు చూపించాడు. బావులవద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడే వయ్యారాలు, నీటి బిందెలు ఎత్తుకొని నడచి వెళ్ళెడి స్త్రీల సౌందర్యం, చేదకోసం వేచి నిలబడియున్న స్త్రీల లావణ్యం, బిందెలను నెత్తిన ఎత్తుకొని వెళ్ళెడి స్త్రీల నడవడిక , నిలుచునే విధానము, బిందెలు భూజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ బంగిమల కూర్పు, ఆనాటి స్త్రీల వస్త్రధారణా విధానమున చూపిన సహజత్వం, ఆ నూతి వెనుక (బావి) ప్రకృతి యొక్క దివ్యత్వం చూసిన కన్నులకు రసానందము కల్గించు అద్వితీయ కళా సృష్టి ఈ చిత్రము. విశ్వవిఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ , నైపుణ్యం దామెర్ల దని నిరూపించెడి చిత్రమిది.
Line 43 ⟶ 40:
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:భారతీయ చిత్రకారులు]]
"https://te.wikipedia.org/wiki/దామెర్ల_రామారావు" నుండి వెలికితీశారు