కాణిపాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 126:
}}
ఈ పుణ్యక్షేత్రం [[చెయ్యేరు|బాహుధా]] నది ఉత్తరపు ఒడ్డున, [[తిరుపతి]]-[[బెంగళూరు]] [[జాతీయ రహదారి]]పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ [[జనమేజయుడు]] కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.<ref>[http://books.google.com/books?id=pmEUAAAAYAAJ&pg=PA155&lpg=PA155&dq=kanipakkam#v=onepage&q=kanipakkam&f=false Lists of the antiquarian remains in the presidency of Madras]</ref> ఈ [[ఆలయం]]<nowiki/>లోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.
 
==పేరు వెనుక చరిత్ర==
''కాణి'' అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, ''పారకం'' అంటే [[నీళ్లు]] పొలంలోకి పారటం అని అర్ధం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు [[మూగ]] మరొకరికి [[చెవుడు]]. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ''ఏతాం''లతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి [[రక్తం]] కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన [[స్వయంభువుడు]] అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ [[కొబ్బరి]] నీరు ఒక [[ఎకరం]] పావు దూరం చిన్న [[కాలువ]]<nowiki/>లా ప్రవహించింది. దీన్ని ''కాణిపరకం'' అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను ''కాణిపాకం''గా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి [[విగ్రహము|విగ్రహం]] నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క [[బావి]] కూడా వున్నది దానిలో స్వామి వారి [[వాహనము]] [[ఎలుక]] ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
 
==గణాంకాలు==
*జనాభా (2011) - మొత్తం 4,960 - పురుషుల 2,500 - స్త్రీల 2,460- గృహాల సంఖ్య 1,267
Line 142 ⟶ 140:
*విస్తీర్ణము: 729 హెక్టార్లు
*మండలములోని గ్రామాల సంఖ్య: 27
 
==సమీప గ్రామాలు==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Chittoor/Irala/Kanipakam|url=http://www.onefivenine.com/india/villages/Chittoor/Irala/Kanipakam|accessdate=14 June 2016}}</ref> [[కొత్తపల్లె]] 1 కి.మీ. [[చిగరపల్లె]] 1 కి.మీ. [[కొత్తపల్లె]] 2 కి.మీ. ఉత్తర బ్రాహ్మణ పల్లె 2 కి.మీ. [[పట్నం]] 2 కి.మీ. దూరములో ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
;బస్సు సౌకర్యములు: [[తిరుపతి]] నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. [[చిత్తూరు]] నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. [[చంద్రగిరి]] నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ [[చిత్తూరు]]కు లేదా [[రేణిగుంట]] లేదా [[గూడూరు,నెల్లూరు|గూడూరు]] లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.
;విమాన సౌకర్యములు: తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.
 
==పాఠశాలలు==
ఈ గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత [[పాఠశాల]] ఉంది.
Line 162 ⟶ 157:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఇక్కడి ప్రధాన వృత్తులు, [[వ్యవసాయము]] మరియు వ్వవసాయాధార పనులు, వ్యాపారము.
 
==ఇతర "విశేషాలు", ఆలయాలు==
[[File:View at Kanipakam Temple.jpg|thumb|center|650px|కాణిపాకం ఆలయ సమూహము]]
Line 169 ⟶ 163:
ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన [[శివాలయం]], వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, [[నవగ్రహాలు|నవగ్రహ]] ఆలయాలున్నాయి.
==భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా==
 
కాణిపాకంఅన్నది చిత్తూరు జిల్లాకు చెందినా [[ఐరాల]] తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1267 ఇళ్లతో మొత్తం 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన [[చిత్తూరు]] 12 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2500, ఆడవారి సంఖ్య 2460గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1531 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596496[1].
 
==అక్షరాస్యత==
* మొత్తం అక్షరాస్య జనాభా: 3538 (71.33%)
* అక్షరాస్యులైన మగవారి జనాభా: 1975 (79.0%)
* అక్షరాస్యులైన స్త్రీల జనాభా: 1563 (63.54%)
 
==విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రైవేటు మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలు, ఉన్నవి.
సమీప బాలబడి , అనియత విద్యా కేంద్రం ([[ఐరాల]]లో) , సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు ([[చిత్తూరు]]లో), వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థ [[తిరుపతి]]లో, , పాలీటెక్నిక్, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల , , దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.<ref name="github.com">https://github.com/IndiaWikiFiles/Andhra_Pradesh/blob/master/Chittur-Villages-Telugu/Kanipakam_596496_te.wiki</ref>
 
==ప్రభుత్వ వైద్య సౌకర్యం==
ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 అలోపతీ ఆసుపత్రి, 1 మామూలు ఆసుపత్రి, ఉన్నవి.సమీప పశు వైద్యశాల, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో వున్నది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణా కేంద్రం , టి.బి వైద్యశాల, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.
 
==ప్రైవేటు వైద్య సౌకర్యం==
గ్రామంలో 2 మందుల దుకాణాలులు ఉన్నాయి.
Line 189 ⟶ 178:
==త్రాగు నీరు==
గ్రామములో రక్షిత మంచి నీరు వున్నది. మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల చెరువు/కొలను/సరస్సు నుంచి కూడ నీటిని వినియోగిస్తున్నారు.
 
==పారిశుధ్యం==
తెరిచిన డ్రైనేజీ గ్రామంలో ఉంది. డ్రెయినేజీ నీరు నేరుగా నీటి వనరుల్లోకి వదిలివేయబడుతోంది. పూర్తి పారిశుధ్య పథకం కిందకు ఈ ప్రాంతం వస్తుంది.
 
==కమ్యూనికేషన్ మరియు రవాణా సౌకర్యం==
ఈ గ్రామములో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం , పబ్లిక్ [[ఫోన్ ఆఫీసు]] సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, ప్రైవేటు కొరియర్ సౌకర్యం, పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, టాక్సీ సౌకర్యం, ట్రాక్టరు మున్నగునవి ఉన్నవి.
Line 200 ⟶ 187:
==మార్కెట్ మరియు బ్యాంకింగ్==
ఈ గ్రామములో ఏటియం, వాణిజ్య బ్యాంకు , సహకార బ్యాంకు, వ్యవసాయ ఋణ సంఘం, స్వయం సహాయక బృందం, వారం వారీ సంత, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నవి.
 
==ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు==
ఈ గ్రామములో ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), సినిమా / వీడియో హాల్, ఇతర (పోషకాహార కేంద్రం), ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), పబ్లిక్ రీడింగ్ రూం, అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, వార్తాపత్రిక సరఫరా, జనన మరణాల నమోదు కార్యాలయం లు ఉన్నది.
 
==విద్యుత్తు==
ఈ గ్రామములో విద్యుత్ సరఫరా విద్యుత్తు ఉన్నది.
 
==భూమి వినియోగం==
గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో):
Line 217 ⟶ 201:
* నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 434.38
* నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 76.49<ref name="github.com"/>
 
==నీటిపారుదల సౌకర్యాలు==
గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో):
 
బావులు/గొట్టపు బావులు: 76.49
 
"https://te.wikipedia.org/wiki/కాణిపాకం" నుండి వెలికితీశారు