బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బంగోరె''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''బండి గోపాలరెడ్డి''' (1938-1982) గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు. నెల్లూరులో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. కొద్దికాలం పాటు వివిధ వృత్తులు చేపట్టినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు. నెల్లూరు స్థానిక చరిత్రతో ప్రారంభమైన కృషి విస్తరిస్తూ వేమన, సి.పి.బ్రౌన్‌, గురజాడ వంటి పలువురి సాహిత్యం, జీవితాలపై లోతైన పరిశోధనలతో తెలుగు సాహిత్య పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో బ్రౌన్ సాహిత్య కృషిపైన, వేమనపై, వేమన గురించి 20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య కృషికి ప్రోత్సహించిన సి.ఆర్.రెడ్డి, సాగించిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటివారి గురించి, గురజాడ జీవితం, సాహిత్యాల గురించి, వీరేశలింగం గురించి, అజ్ఞాత చరిత్రకారులు, జర్నలిస్టుల గురించి - ఇలా ఎన్నెన్నో అంశాల గురించి పరిశోధనలు, ప్రచురణలు చేశారు. గురజాడ అప్పారావు [[కన్యాశుల్కం (మొదటి కూర్పు)|కన్యాశుల్కం మొదటి కూర్పు]], బ్రౌన్ ప్రచురించిన తాతాచార్ల కథలు, సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు, వ్యాసాలు, డాక్టర్ జె.మంగమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా వంటివెన్నో వెలికితీసి, పరిష్కరించి, నోట్స్ రాసి పలు హోదాల్లో ప్రచురించాడు. స్వయంగా సి.పి.బ్రౌన్ జర్నలిజం చరిత్ర, సి.పి.బ్రౌన్ సాహిత్య స్వీయచరిత్ర, బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి పలు అంశాలపై గ్రంథాలు రాశారు. బంగోరె పరిశోధనల్లో వెలికివచ్చిన అంశాల్లో గురజాడ అప్పారావు జన్మదినం, బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడ్డ నెల్లూరు అజ్ఞాత స్వాతంత్ర్య యోధుడు వంటివి ఉన్నాయి. జమీన్ రైతు పత్రిక సహాయ సంపాదకునిగా 1964 నుంచి 1971 వరకు, ఆపైన ఏడాది పాటు మద్రాసు (నేటి చెన్నై)లో అమెరికన్ రిపోర్టరులో పాత్రికేయునిగా, 1975 నుంచి 1979 వరకూ తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచి ఏడాది పాటు ప్రభుత్వం వేమనపై ఏర్పరిచన పరిశోధన ప్రాజెక్టులో, ఆపైన 1982 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి గురించి ఏర్పరిచిన ప్రాజెక్టులో పనిచేశాడు. 1975 - 1982 మధ్యకాలంలో పలు అకడమిక్ రీసెర్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తూ, తన పరిశోధన సంతృప్తికరంగా ముగియకుండానే వాటి కాలం చెల్లిపోతూ, అస్థిరమైన పరిస్థితుల్లో జీవించడం, పరిశోధన ప్రాజెక్టుల్లో పరిస్థితులు వంటికారణాలతో జీవితేచ్ఛ కోల్పోయాడు. ఎవరికీ చెప్పకుండా నెల్లూరు విడిచిపెట్టి ఢిల్లీ, హరిద్వార్, హృషీకేశ్ వంటి ప్రాంతాలు తిరిగి, అశాంతితో 1982 అక్టోబర్ 31న 44 సంవత్సరాల ప్రాయంలో భాక్రానంగల్ ప్రాజెక్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బంగోరె చేసిన పరిశోధన కృషి ఎంతో ఉన్నా రాసుకున్న నోట్సులోంచి విస్తరించి చేయాల్సిన పరిశోధనలు, పరిష్కరించి చేయాల్సిన ప్రచురణలు మరణానంతరం మిగిలిపోయే ఉన్నాయి.
 
==జీవిత సంగ్రహం==
పంక్తి 14:
బండి గోపాలరెడ్డి 1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తెలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
 
ఈ కృషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది(1977 ఫిబ్రవరి). దీనికి ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి ప్రధాన సంపాదకుడుగా, బంగోరె సంపాదకుడుగా వ్యవహరించారు వీరిద్దరు కలిసి " Literary auto biography of C.P.Brown" ను యస్.వి. విశ్వవిద్యాలయం పక్షాన 1978లో తెచ్చారు. 1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు: కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవలఫై ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు(1979). ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-April 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరెలో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్దాన్తరం గాఅర్థాంతరంగా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు అతనిమీద ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత, బాసిజం ఏవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కావు. ఏమయినా తనకున్న పరిమిత అవకాశాల్లో వేమన గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భండాగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు. సుడిగాలి పర్యటనలు చేసి బోలెడంత భోగట్టా రాశి పోసాడు. కోర్ట్ స్టే లతో 1981లో ఆ పదవిలో కొన్నాళ్ళు సాగినా , ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి మీద ఒక పరిశోధనకు బంగోరె నియమించబడ్డాడు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది. అలసిపోయి, నిరాశతో నెల్లూరు చేరాడు.అతనిలో ఘనీభవించిన అసంతృప్తి, జీవితేచ్చ కోల్పోవడం వంటి వైక్లబ్యాలను సన్నిహిత మిత్రులు కూడా గమనించలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హ్రిషికేశ్ తదితర ప్రదేశాలు ఒక గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భాక్రానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే.
 
==రచనలు==
# తాతాచారి కథలు - నాల్గవ ముద్రణ యంయస్ కో ప్రచురణ(సంపాదకత్వం)<ref>[http://pustakam.net/?p=4635 మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే]</ref>
# [[మాలపల్లి (నవల)|మాలపల్లి]] నవలపై ప్రభుత్వ నిషేధాలు సొంత ప్రచురణ, 1978-79.
# వేమన-సి.ఆర్.రెడ్డి : 1928లో [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ|రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ]] గారితో [[అనంతపురం]]<nowiki/>లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] తరఫున చేసిన 'వేమన్వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ [[గ్రంథము|గ్రంథం]]. [[వేమన]]<nowiki/>కు సంబంధించి [[కట్టమంచి రామలింగారెడ్డి|సి.ఆర్.రెడ్]]<nowiki/>డి, రాళ్ళపల్లికి రాసిన విలువైన జాబులు ఈ సంకలనంలో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీటవేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, [[మహాకవి]]<nowiki/>గా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు. బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంథం.<ref>[http://kinige.com/book/Vemana+C+R+Rreddy కినిగె లో పుస్తక వివరాలు]</ref>
# బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర <ref>[https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE_-44 అన్నమయ్య గ్రంథాలయం లో తెలుగు సాహిత్య విభాగంలో 1161 సంఖ్య పుస్తకం]</ref>
#చంద్రిక కథ (తమిళం నుంచి అనువాదం, యన్.యస్. కృష్ణమూర్తి, గోపాలకృష్ణ రాఘవన్ లతో కలిసి.)1969లో జమీన్ రైతులో ధారావాహికగా ప్రచురించి, 1971లో పుఅతకంగాపుస్తకంగా తెచ్చాడు. ఇటీవల వ్యాపార ప్రచురణ సంస్థల వాళ్ళు దీనికి పునర్ ముద్రణలు తెచ్చారు.
#విక్రమపురి మండల సర్వస్వం, సహాయ సంపాదకుడుగా 1964.నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ.
 
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు