తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2012:D8FC:9D93:47E9:EAE2:77C0 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 5:
తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) [[ఎఱ్ఱన]] జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన [[శ్రీనాథుడు]] తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
 
ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి [[పింగళి లక్ష్మీకాంతం]] తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. [[తెలుగు|తెలుగుభాష]] పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."<ref name="pingali">పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>వంశీ
 
==రాజకీయ, సామాజిక నేపథ్యం==