బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అందరికి పండుగ గురించి తెలుపాలి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
|frequency
}}
'''[[బతుకమ్మ]] పండుగ''' [[తెలంగాణా]] రాష్ట్రములోని [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ]] మాస శుద్ధ [[పాడ్యమి]] నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ [[బతుకమ్మ]] (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది<ref>[http://www.hindu.com/thehindu/mp/2005/02/22/stories/2005022200770300.htm A journey through change]. ''The Hindu'', 22 February 2005. Retrieved 6 October 2011.</ref><ref>[http://www.thehindu.com/life-and-style/Food/article799015.ece Joys of cooking], ''The Hindu'', 27 September 2010. Retrieved 6 October 2011.</ref>.
 
== బతుకమ్మ పండుగ విశిష్టత ==
పంక్తి 57:
ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు [[పత్రము|ఆకులు]], పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో [[గౌరి]] దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో [[నిమజ్జనం]] చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
 
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా [[వేరుశనగ]] లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారుతింటారు7
 
 
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు