దేవకన్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
imdb_id= 0290562
}}
ఛాయాచిత్ర పిక్చర్స్ బేనర్‌పై సుబ్బరాజు సోదరుడు శ్రీరామరాజు, ప్రత్యగాత్మ సోదరుడైన [[కె. హేమాంబరధరరావు]] దర్శకత్వంలో రూపొందించిన '''దేవకన్య''' [[1968]], [[మార్చి 23]]న విడుదల అయ్యింది.
==సాంకేతిక వర్గం==
‘దేవకన్య’ చిత్రానికి కథ, మాటలు: వీటూరి, కూర్పు: అంకిరెడ్డి, నృత్యం: చిన్ని- సంపత్, నృత్యతారలు సరస్వతి (సచ్చు), రాజీ, రేణు, ఫొటోగ్రఫీ: యం.జి.సింగ్, యం.సి.శేఖర్, స్టంట్స్: సాంబశివరావు, పార్టీ సంగీతం: టి.వి.రాజు, నిర్మాత: బి.హెచ్.శ్రీరామరాజు, దర్శకత్వం: కె.హేమాంబరధరరావు.
==నటీనటులు==
ఈ చిత్రంలో పేరమ్మగా నిర్మల, శ్రీధర్ స్నేహితుడుగా బాలకృష్ణ, అతని భార్యగా రమాప్రభ, ఆమె తల్లిగా లక్ష్మీకాంతమ్మ, కామపాలుని అనుచరుడు కలికాలంగా అల్లురామలింగయ్య ఇతర పాత్రలు పోషించారు.
==చిత్రకథ==
అలకాపురి ప్రభువు కుబేరుడు (ప్రభాకర్‌రెడ్డి) అతని శివ పూజకు ఆటంకం కలిగించిన విద్యాధరుడు (కాంతారావు), కిన్నెర (కాంచన)లను భూలోకంలో జన్మించమని, ఒక్క ఝాములో 11 శివక్షేత్రాలు దర్శిస్తే విద్యాధరునికి, ఆమె అందమే ఆమెకు శత్రువు అయిన కినె్నర దైవబలంతో కష్టాలు అధిగమిస్తారని తెలియచేస్తాడు. ఆ ప్రకారం భూలోకంలో ఇంద్రసేన మహారాజు (మిక్కిలినేని) మహరాణి (హేమలత)లకు జన్మించిన శ్రీధర్, అడవిలో రాజగురువు(నాగయ్య)వద్ద పెరుగుతాడు. యుక్తవయస్కుడై తండ్రి (బోయి)ని కలియబోయి నిందకు గురవుతాడు. దారిలో కలిసిన లాలాస (కాంచన)తో కామరూపం దేశంలోని కామపాలుని (రాజనాల)వద్ద కొలువులో చేరతాడు. లాలాసపై ఆశపడ్డ కామపాలుడు, శ్రీధర్‌ను తలపగలకొట్టి ఓ యక్షుడు మణికంధరుడు (్భమరాజు)వుండే చెట్టువద్ద వదలి వెళతాడు. ఆ రాత్రి ఆ చెట్టు కదిలి శివక్షేత్రాలు తిరగటం, దానితో శ్రీధర్ శాపం తీరటం జరుగుతుంది. కామపాలుని నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకిన లాలాసను ఒక యోగి (త్యాగరాజు) కాపాడి, ఆపైన ఆమెను వాంఛిస్తాడు. తన కోరిక తీర్చనందుకు, ఆమెను తాకితే ఆమె భర్త వికృత రూపుడౌతాడని, ఆమెకు పుట్టిన కుమారునిచే పాపనాశనం వద్ద, పాతాళ జలంతో అతడు శాప విముక్తుడౌతాడని తెలియచేసి, తన తపస్సు భంగం అయినందుకు ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఇంతలో శ్రీధర్ కామపాలుడి నుంచి తండ్రిని రక్షించి, లాలాసకోసం వెదకి ఆమెవలన వికృతరూపం పొంది, ఒకరోజు ఆమెతో గడిపి వెళ్ళిపోతాడు. గర్భవతియైన లాలాస కుమారుని కని, ఆ బాలునికి 5 సం.లు వచ్చాక అతనితో పాతాళ గంగకోసం, పాపనాశనం బయలుదేరుతుంది. ఆమెకోసం వేచివున్న కామపాలుడు ఆమెను బలవంతం చేయబోగా, వికృత రూపంలోవున్న శ్రీధర్ వచ్చి ఆమెను రక్షించటం, దైవబలంచే, విసిరిపడిన చెంబు పైకెగసి, గంగాజలంతో శ్రీధర్ శాప విముక్తి పొందటం. అక్కడకు వచ్చిన రాజదంపతులు, కుమారుడు, కోడలు, మనవడితో రాజ్యం చేరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
యచేసి, తన తపస్సు భంగం అయినందుకు ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఇంతలో శ్రీధర్ కామపాలుడి నుంచి తండ్రిని రక్షించి, లాలాసకోసం వెదకి ఆమెవలన వికృతరూపం పొంది, ఒకరోజు ఆమెతో గడిపి వెళ్ళిపోతాడు. గర్భవతియైన లాలాస కుమారుని కని, ఆ బాలునికి 5 సం.లు వచ్చాక అతనితో పాతాళ గంగకోసం, పాపనాశనం బయలుదేరుతుంది. ఆమెకోసం వేచివున్న కామపాలుడు ఆమెను బలవంతం చేయబోగా, వికృత రూపంలోవున్న శ్రీధర్ వచ్చి ఆమెను రక్షించటం, దైవబలంచే, విసిరిపడిన చెంబు పైకెగసి, గంగాజలంతో శ్రీధర్ శాప విముక్తి పొందటం. అక్కడకు వచ్చిన రాజదంపతులు, కుమారుడు, కోడలు, మనవడితో రాజ్యం చేరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/దేవకన్య" నుండి వెలికితీశారు