అత్తగారు కొత్తకోడలు: కూర్పుల మధ్య తేడాలు

5,096 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
==కథ==
సూరమ్మ (సూర్యకాంతం) ఒక వూరిలోని ఆస్తిపరురాలు. వడ్డీవ్యాపారం చేస్తూ పేదవాళ్ళను పీడిస్తూ ఉంటుంది. సవతి కొడుకు సత్యం (సత్యనారాయణ), కోడలు పుష్పకుమారిని ఆరళ్ళుపెడుతూ ఉంటుంది. కట్నం డబ్బు 10వేలు ఇవ్వకుండా కూతురు ధనలక్ష్మి(రమాప్రభ)ను అత్తగారింటికి పంపక, తనవద్దే వుంచుకుంటుంది. ఆమె మాట ప్రకారం ధనలక్ష్మి అందరి విషయాలు, తల్లికి చాడీలు చెబుతుంటుంది. ఆమె ఇద్దరు కొడుకులు మధు(హరనాథ్), గోపి(కృష్ణ) తల్లిని ఎదిరించలేక అవస్థలు పడుతుంటారు. మధు, పట్నంలో లక్షాధికారి నాగభూషణం కూతురు లత (జయంతి) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకు పెళ్ళికి తండ్రి అంగీకరించక పోవటంతో, స్నేహితురాలు రాధ (విజయనిర్మల), ఆమె తండ్రి కోటయ్య సాయంతో రిజిస్టర్ మ్యారేజి చేసుకుంటారు. భార్యతో పల్లెటూరు వచ్చిన మధు, అంతకుముందే తల్లి, మేనమామ నాగన్న (సాక్షి రంగారావు) కుట్రవలన దొంగతనం నేరంమీద సత్యం దంపతులు ఇల్లువదిలి వెళ్ళారని తెలుసుకుంటాడు. మధు కోరినా, సత్యం తిరిగి ఇంటికి రాక, పొలం వద్దనే పాకలో వుంటాడు. మధు పొలం పనులు చేయటం, లతకు ఆస్తిరాదని తెలిసిన రాధమ్మ ఆమెను అనేక ఆరళ్ళు పెట్టడంతో గర్భవతి ఐన, లతకు అబార్షన్ అవుతుంది. దాంతో మధు, లత తిరిగి పట్నం వెళ్ళిపోతారు. రాధ, గోపితో కలిసి, ఆస్తికల దైవ భక్తురాలిగా నాటకం ఆడి, సూరమ్మ చేత ఒప్పించి, గోపిని పెళ్ళాడి, కోడలుగా ఆ ఇంటికి వచ్చి, ధనలక్ష్మిని, ఆమె భర్త గిరిబాబు (రాజ్‌బాబు)తో పంపించి వేసి, ఆమె మరణించిందని, ఉత్తరం చూపి, దాని ద్వారా అత్తగారిని భయపెట్టి, లతను ఆమె పెట్టిన కష్టాలుపెట్టి ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. నాగన్న అత్తగారిని మోసంచేసి ఆస్తి రాయించుకొని, అమ్మబోగా అన్నదమ్ములు ముగ్గురూ కలిసి దాన్ని అడ్డుకోవటం, సూరమ్మకు జ్ఞానోదయం కలిగి కోడళ్ళను ఆదరించటంతో చిత్రం ముగుస్తుంది<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-11 అత్తగారు- కొత్తకోడలు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 16-06-2018]</ref>.
 
 
 
దర్శకులు సంజీవి, పినిశెట్టి సమకూర్చిన, ‘‘ఎన్నో ఏళ్ళుగా సంఘంలో కొనసాగుతున్న అత్తగార్ల దాష్టీకం, పెత్తనం, ధనం, విద్య, స్తోమతులేని కోడళ్ళ నిస్సహాయత, ఎటువైపూ మొగ్గుచూపలేని కొడుకుల వైఖరిల ఆధారంగా వచ్చిన చిత్రాల కథలకు మరికొంత, కొత్తదనం జోడించి తయారుచేసిన కథను ఎంతో వివరంగా అలరించేలా సమాజంలోని వ్యక్తుల్లో కొంత మార్పు కలిగేలా చిత్రీకరించారు. అత్తింటికి వెళ్ళని ధనలక్ష్మి తల్లికోసం చాడీలుచెప్పి చిన్నన్నచేత ‘దరిద్ర లక్ష్మిగా’పిలవబడటం, చిన్నవదిన రాధ మాట విని తన కాపురం నిలబెట్టుకోవటం. విద్యావతి, సున్నిత హృదయిని అయిన లత, డబ్బులేని కారణంగా అత్తగారి ధాష్టీకం భరించటం, ఇంటెడు చాకిరిచేసినా సవతి కొడుకు, కోడలు అత్తగారి నిందలు పడడం. అన్నీ తెలిసిన చిన్న కొడుకు గోపి భార్యకు, పరోక్షంగా సాయపడడం. అత్తగారిని పంతంకోసం అల్లరిపెడుతూ, కష్టాలు పెడుతూ, దానికోసం, చాటున చిన్నకోడలు చింతించటం, ఒక ప్రయోజనంకోసం వేసిన మారువేషం ద్వారా కొన్ని సరదా సన్నివేశాలు వడ్డీపత్రాలు చించి వేయించటం వంటివి. చివరకు అన్నదమ్ములు ముగ్గురూ, రౌడీలను ఎదిరించగా, ఆ పోరులో పక్షవాతానికి గురయిన సత్యం కాలు తిరిగి స్వాధీనంలోకి రావటం వంటి జనరంజక సన్నివేశాలను కామెడీ, సీరియెస్‌నెస్ కలబోసి, అయినవాళ్ళుకూడా అవకాశం దొరికితే చేసే మోసంపట్ల(నాగన్న పాత్ర ద్వారా) జాగరూకత అవసరం అనే నిజం తెలియచేస్తూ రూపొందించటం విశేషం.
పాత్రధారులందరూ తమ పాత్ర పరిధులమేరకు ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్టు సూర్యాకాంతం, విజయనిర్మల తమ సామర్థ్యం చూపారు.
ఈ చిత్ర గీతాలు: జి.కె.వెంకటేష్ స్వరాలతో అలరించాయి. (ఆత్రేయ) (రచన), జయంతి, విజయనిర్మలలపై చిత్రీకరించిన ఉడికించే గీతం ‘చిటుకుమన్నది చిటికెమ్మా కిర్రుమన్నది తలుపమ్మా’(పి.సుశీల) మరో ఆత్రేయ గీతం ‘వయసు ఆగదు మనకోసం’(పి.సుశీల, ఘంటసాల) (కృష్ణ, విజయనిర్మలపై చాటునుంచి రమాప్రభలపై చిత్రీకరణ) ఆరుద్ర వ్రాసిన గీతాలు ‘రమాప్రభ, రాజ్‌బాబులపై ‘ఘాటుఘాటు ప్రేమ ఎడబాటు లాయెనే’(ఎ.ఎం.రాజా, ఎల్.ఆర్.ఈశ్వరి) జయంతి, హరనాథ్‌లపై పట్నంలో తోటలో చిత్రీకరణ. ‘నువ్వు లేనిదే పువ్వు పువ్వుకాదు’ (పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి) కృష్ణ, విజయనిర్మలపై చిత్రీకరించిన గీతం ‘పెళ్ళిచేసుకుంటా నినే్న పెళ్ళిచేసుకుంటా’(ఘంటసాల, విజయనిర్మల మాటలు- రచన కొసరాజు) భక్తురాలిగా విజయనిర్మలపై చిత్రీకరించిన గీతం ‘రేపల్లెవాడలో వేడుక’ (పి.సుశీల బృందం- రచన మల్లాది) ఈ చిత్రంలో జయంతి, ఊహలో బాబును గూర్చిన ఊహాగీతం ‘వెనె్నల తెచ్చాడు మా పాపడు నవ్వులు పంచాడు’(గానం- ఎస్.జానకి).
‘అత్తగారు- కొత్తకోడలు’ చిత్రం కుటుంబ కథాచిత్రంగా ప్రేక్షకుల గుర్తింపు పొందింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రంగా కొంతవరకూ విజయం సాధించింది.
 
==పాటలు==
# చిటుకుమన్నది చిటికెమ్మా కిర్రుమన్నది తలుపమ్మా - పి.సుశీల
# ఘాటుఘాటుప్రేమ ఎడబాటు - ఎ. ఎం.రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి
# దేవా లోకములోని చీకటులన్నీ - పి.బి.శ్రీనివాస్
# పెళ్ళిచేసుకుంటా నిన్నే పెళ్ళి - ఘంటసాల ( విజయనిర్మల మాటలతో)
# వయసు ఆగదు మన కోసం - ఘంటసాల, సుశీల
# నువ్వు లేనిదే పువ్వు పువ్వుకాదు - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
# రేపల్లెవాడలో వేడుక - పి.సుశీల బృందం
# వెన్నెల తెచ్చాడు మా పాపడు నవ్వులు పంచాడు - ఎస్.జానకి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
==బయటి లింకులు==
==వనరులు==
* {{IMDb title|1485680}}
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
70,929

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2477818" నుండి వెలికితీశారు