అత్తగారు కొత్తకోడలు
అక్కినేని సంజీవి దర్శకత్వంలో నిర్మాత బాబూరావు కల్పనా చిత్ర పతాకంపై రూపొందించిన చిత్రం అత్తగారు-కొత్తకోడలు. ఈ చిత్రం 1968, జూన్ 14న విడుదలైంది. ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం జీ. కె. వెంకటేష్ అందించాడు.
అత్తగారు కొత్తకోడలు (1968 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | అక్కినేని సంజీవి |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, సూర్యకాంతం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, హరనాధ్, రమణారెడ్డి, నాగభూషణం |
సంగీతం | జి.కె. వెంకటేష్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి |
నిర్మాణ సంస్థ | కల్పనచిత్ర |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- కథ: పినిశెట్టి
- కథా సంవిధానం, మాటలు: ఆచార్య ఆత్రేయ,
- కూర్పు: జగదీష్
- డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కె.యస్.ప్రసాద్
- కళ: సూరన్న
- నృత్యం: తంగప్ప
- పోరాటాలు: రాఘవులు
- సంగీతం: జి.కె.వెంకటేష్
- స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎ.సంజీవి
- నిర్మాత: బాబూరావు
నటీనటులు
మార్చుకథ
మార్చుసూరమ్మ (సూర్యకాంతం) ఒక వూరిలోని ఆస్తిపరురాలు. వడ్డీవ్యాపారం చేస్తూ పేదవాళ్ళను పీడిస్తూ ఉంటుంది. సవతి కొడుకు సత్యం (సత్యనారాయణ), కోడలు పుష్పకుమారిని ఆరళ్ళుపెడుతూ ఉంటుంది. కట్నం డబ్బు 10వేలు ఇవ్వకుండా కూతురు ధనలక్ష్మి(రమాప్రభ)ను అత్తగారింటికి పంపక, తనవద్దే వుంచుకుంటుంది. ఆమె మాట ప్రకారం ధనలక్ష్మి అందరి విషయాలు, తల్లికి చాడీలు చెబుతుంటుంది. ఆమె ఇద్దరు కొడుకులు మధు(హరనాథ్), గోపి(కృష్ణ) తల్లిని ఎదిరించలేక అవస్థలు పడుతుంటారు. మధు, పట్నంలో లక్షాధికారి నాగభూషణం కూతురు లత (జయంతి) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకు పెళ్ళికి తండ్రి అంగీకరించక పోవటంతో, స్నేహితురాలు రాధ (విజయనిర్మల), ఆమె తండ్రి కోటయ్య సాయంతో రిజిస్టర్ మ్యారేజి చేసుకుంటారు. భార్యతో పల్లెటూరు వచ్చిన మధు, అంతకుముందే తల్లి, మేనమామ నాగన్న (సాక్షి రంగారావు) కుట్రవలన దొంగతనం నేరంమీద సత్యం దంపతులు ఇల్లువదిలి వెళ్ళారని తెలుసుకుంటాడు. మధు కోరినా, సత్యం తిరిగి ఇంటికి రాక, పొలం వద్దనే పాకలో వుంటాడు. మధు పొలం పనులు చేయటం, లతకు ఆస్తిరాదని తెలిసిన రాధమ్మ ఆమెను అనేక ఆరళ్ళు పెట్టడంతో గర్భవతి ఐన, లతకు అబార్షన్ అవుతుంది. దాంతో మధు, లత తిరిగి పట్నం వెళ్ళిపోతారు. రాధ, గోపితో కలిసి, ఆస్తికల దైవ భక్తురాలిగా నాటకం ఆడి, సూరమ్మ చేత ఒప్పించి, గోపిని పెళ్ళాడి, కోడలుగా ఆ ఇంటికి వచ్చి, ధనలక్ష్మిని, ఆమె భర్త గిరిబాబు (రాజ్బాబు)తో పంపించి వేసి, ఆమె మరణించిందని, ఉత్తరం చూపి, దాని ద్వారా అత్తగారిని భయపెట్టి, లతను ఆమె పెట్టిన కష్టాలుపెట్టి ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. నాగన్న అత్తగారిని మోసంచేసి ఆస్తి రాయించుకొని, అమ్మబోగా అన్నదమ్ములు ముగ్గురూ కలిసి దాన్ని అడ్డుకోవటం, సూరమ్మకు జ్ఞానోదయం కలిగి కోడళ్ళను ఆదరించటంతో చిత్రం ముగుస్తుంది.[1]
పాటలు
మార్చు- చిటుకుమన్నది చిటికెమ్మా కిర్రుమన్నది తలుపమ్మా - పి.సుశీల, రచన: ఆత్రేయ
- ఘాటుఘాటుప్రేమ ఎడబాటు - ఎ. ఎం.రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి, రచన:ఆరుద్ర
- దేవా లోకములోని చీకటులన్నీ - పి.బి.శ్రీనివాస్, రచన: దాశరథి
- పెళ్ళిచేసుకుంటా నిన్నే పెళ్ళి - ఘంటసాల ( విజయనిర్మల మాటలతో) రచన: కొసరాజు.
- వయసు ఆగదు మన కోసం - ఘంటసాల, సుశీల . రచన: ఆత్రేయ
- నువ్వు లేనిదే పువ్వు పువ్వుకాదు - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, రచన: ఆరుద్ర
- రేపల్లెవాడలో వేడుక - పి.సుశీల బృందం , రచన: మల్లాది
- వెన్నెల తెచ్చాడు మా పాపడు నవ్వులు పంచాడు - ఎస్.జానకి, రచన: ఆచార్య ఆత్రేయ.
మూలాలు
మార్చు- ↑ "అత్తగారు- కొత్తకోడలు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 16-06-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-27.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)