మిస్సమ్మ (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి మరియు [[పింగళి నాగేంద్రరావు]]లు రచించగా [[ఎల్వీ ప్రసాదు]] దర్శకత్వంలో రూపొందిచబడింది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది.
 
ఈ సినిమాకు [[పింగళి నాగేంద్రరావు]] రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, [[ఎ.ఎం.రాజా]], [[పి.లీల]], [[పి.సుశీల]] గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన ''కరుణించు మేరిమాత'' అనేపాట హృదయాలను తాకుతుంది. [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గొంతు వినిపించని కొద్ది సూపర్‌హిట్‌ తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. [[విప్రనారాయణ]], [[పెళ్ళి కానుక (1960 సినిమా)|పెళ్ళికానుక]] కూడా ఈ కోవలోకి వస్తాయి.
 
సినిమా చిత్రీకరణ మద్రాసు (ప్రస్తుతం చెన్నై) చుట్టుపక్కల జరిగింది, 1954 డిసెంబరు నాటికల్లా చిత్రీకరణ పూర్తయింది. మిస్సమ్మ సినిమా 1955 జనవరి 12న తొలిసారి ప్రదర్శించారు, ఆపైన మరో రెండు రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు,, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా నిర్మించారు. మిస్ మేరీ ఎల్‌.వి.ప్రసాద్‌కి బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది. 1991లో ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండలరావు మిస్సమ్మ సినిమా కాన్సెప్టుని తిరగేసి, అడాప్ట్ చేసుకుని పెళ్ళిపుస్తకం కథ రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశాడు, ఇదీ మంచి విజయం సాధించింది.
 
==సినిమా కథ==
"https://te.wikipedia.org/wiki/మిస్సమ్మ_(1955_సినిమా)" నుండి వెలికితీశారు