గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Muppavaram community hall.jpg|గ్రామ పంచాయతి సముదాయ భవనం|right|thumb]]
[[పంచాయతీ|పంచాయతీ రాజ్]] లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ '''గ్రామ పంచాయతీ''' <ref>[http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf గ్రామ పంచాయతి కరదీపిక]</ref><ref>[http://www.apard.gov.in/finalgramapanchayat.pdf గ్రామ పంచాయతి సమాచార దర్శిని]</ref>.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ ఒకటి వుంటుంది. మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్, జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు. తర్వాతిది మండల పరిషత్ తర్వాతిది జిల్లా పరిషత్, పట్టణ స్వపరిపాలన సంస్థలు, పురపాలక సంఘాలు.గ్రామపంచాయతీ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. 1. గ్రామసభ 2. వార్డు సభ్యులు 3. కోఆప్టెడ్‌ సభ్యులు 4. శాశ్వత ఆహ్వానితులు 5. సర్పంచ్,ఉప సర్పంచ్‌ 6. పంచాయతీ కార్యనిర్వహణాధికారి/[[గ్రామ కార్యదర్శి]] 7. [[గ్రామ రెవిన్యూ అధికారి]].
 
1.గ్రామసభ : గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ఏటా ఏప్రిల్‌ 14న, అక్టోబర్‌ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్‌ లేదా ఉప సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి. గ్రామసభకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు