నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి''' సంస్కృత భాషా పండితుడు, సాహితీకారుడు. అతను వేద వేదాంగాలను అధ్యయనం చేసిన వ్యక్తి. అతను గ్రంథరచన, పాఠప్రవచన, ధార్మిక వేదాంత శాస్త్ర విషయ ప్రబోధములతో జీవనయానాన్ని కొనసాగించారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=107196&SupID=25 ఉభయ వేదాన్తాచార్య (08-May-2015)]</ref> అతను [[చిన్న జీయర్ స్వామి|త్రిదండి చినజీయర్‌ స్వామి]]<nowiki/>కి గురువు. చినజీయర్‌కు తర్కశాస్త్రం, సంస్కృతం బోధించారని చెబుతారు. వైష్ణవ శ్రీవైష్ణవ పీఠాధిపతుల్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు.
 
==జీవిత విశేషాలు==
అతను 1926 మే 1 న వైష్ణవ శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వారి స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడలోని మోటూరు. తల్లి శేషమ్మ, తండ్రి శ్రీనివాసతాతాచార్యులు. విద్యాభ్యాసం మొదట తాతాతండ్రుల వద్దనే జరిగింది. తండ్రి వద్ద సంస్కృతం, దివ్యప్రబంధాలు, సాంప్రదాయిక తదితర విషయాలను 1942 వరకు అభ్యసించాడు. 1946లో వరంగల్‌ వచ్చి శివనగర్‌లో స్థిరపడ్డారు. అతను [[హైదరాబాదు|హైదారాబాద్‌]]<nowiki/>లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శ్రీభాష్యాది శాస్త్ర విషయాలను అధ్యయనం చేశాడు. అనంతరం వరంగల్‌లో సింహాద్రిబాగ్‌లోని వైదిక కళాశాలలో ప్రధానాచార్యులుగాను, ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేసి ఎందరినో సంస్కృతాంధ్ర భాషా పండితులుగా తీర్చిదిద్ది పదవీ విరమణ చేసాడు. బాల్యంలోనే కాంచీపుర పీఠాధిపతి ప్రతివాది భయంకర అణ్ణంగాచార్య స్వామివారితో మధిరేక్షణ శబ్దార్థ విషయంలో వివాదపడి ప్రసిద్ధులయ్యాడు. రాష్ట్రంలోని జీర్ణ దేవాలయోద్ధరణ కార్యక్రమాలను చేపట్టి కొన్ని దేవాలయాలను పునఃప్రతిష్ఠగావించాడు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి వైష్ణవశ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు.<ref>{{Cite web|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/eminent-vedic-scholar-nallan-chakravarthula-raghunatha-charyulu-passes-away-1-2-586014.html|title=మూగబోయిన సాహిత్యనిధి}}</ref> సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్, శ్రీ పాంచరాత్ర ఆగమ పాఠశాలను నెలకొల్పి బ్రాహ్మణ విద్యార్థులకు వేదపాఠాలు, ఆగమం, స్మార్తం, దివ్యప్రబందం నేర్పించి ఎంతో మంది విద్యార్థులను అందించాడు. భగవత్‌ కైంకర్యనిధి పేరుతో ధార్మిక సంస్థను నెలకొల్పి 28 శ్రీమద్రామాయణ క్రతువులను నిర్వహించాడు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=648812|title=కవిశాబ్దిక కేసరి రఘునాథాచార్యులు ఇకలేరు}}</ref>
 
 
పంక్తి 53:
* వేదప్రామాణ్యము,
* ఆధ్యాత్మచింత
* వేద సామ్రాజ్యం,
* సత్సంప్రదాయ సుధ,
* తత్వోపహారం,
* శ్రీరంగపతి స్తుతి,
* క్షమాషోడషి (తెలుగు వివరణ),
* విశిష్టాద్వైతము (తెలుగు-సంస్కృతం),
* శ్రీమాలికాస్తుతి,
* సంప్రదాయసుధాసారం,
* గోదాపురేశ మహత్యం (తెలుగు అనువాదం),
*శ్రీ వైష్ణవశ్రీవైష్ణవ సౌభాగ్యము,
* అమృతవర్షిణి,
* భక్త రసాయనము,
* బుధరంజని (రెండు భాగాలు),
* గౌతమధర్మ సూత్రము,
* వైౖష్ణవ సంప్రదాయ సౌరభము,
* లక్ష్మీస్తుతి మంజరి (సంస్కృత వ్యాఖ్య), శ్రీ
* వరవరముని వైభవస్తుతి,
* కేనోపనిషత్‌ (తెలుగు వ్యాఖ్యానం),
* ఉత్తర రామచరిత్ర,
* శ్రీకుమార తాతాచార్య వ్యాఖ్య.
 
==పురస్కారాలు<ref>[http://m.newshunt.com/india/telugu-newspapers/eenadu/warangal/raashtra-sthaayiavaardulaku-eduguri-empika_40204354/999/c-in-l-telugu-n-eena-ncat-warangal రాష్ట్ర స్థాయి అవార్డులకు ఏడుగురి ఎంపిక]</ref>==