"పామాయిల్ రిఫైనింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:refinery.jpg|thumb|right|పామాయిల్‌రిఫైనరి.]]
[[దస్త్రం:bleaching.jpg|thumb|right|బ్లిచింగ్‌విభాగం.]]
'''పామాయిల్ రిఫైనింగ్ '''ద్వారా ముడి/crude పామాయిల్ ను శుద్ధి చేసి వంటకు పనికి వచ్చే వంటనూనెను తయారుచేస్తారు.
 
<big><big> written by:Palagiri Rama Krishna Reddy</big></big>
 
ఆయిల్‌మిల్‌ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌లో ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, [[తేమ]], మలినాలు, వాసన కల్గించు పదార్థాలు వుండును. సంతృప్త ఫ్యాటి ఆమ్లశాతం 50% మించి వుండటం వలన నూనె చిక్కగా వుండును. కెరోటినులు 800-1000 ppm వరకు వుండటం వలన, పామాయిల్‌ [[పసుపు]], ఆరెంజిల మిశ్రమ [[రంగు]]లో వుండును. కావున క్రూడ్‌ పామాయిల్ నేరుగా వంటనూనెగా వినియోగించుటకు పనికిరాదు. క్రూడాయిల్‌లో3-5% వరకు F.F.A. వుండును. ఎఫ్.ఎఫ్.ఎ.వలన నూనెకు చేదు రుచి కల్గుతుంది, మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొగ వెలువడుతుంది. ఫ్రీఫ్యాటిఆమ్లాలు, తేమ, గమ్స్‌, వలన నూనెలో కెటొన్స్‌, అల్డిహైడ్స్‌, ఉత్పన్నమగును. వీటన్నింటిని తొలగించిన తరువాతనే పామాయిల్‌ను వంటనూనెగా ఉపయోగించటానికి వీలవుతుంది.ఈ విధంగా వ్యర్ధపదార్థాలను, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, కలరు బ్లీచింగ్, డిఒడరైజెసన్‌ చేసి, నూనెను వాడకానికి అనుకూలంగా చెయ్యు ప్రక్రియను శుద్ధీకరణ (Refining) అందురు. ఈ విధంగా ప్రాసెస్‌చేసిన నూనెను రిపైండ్‌ పామాయిల్‌ అంటారు.
[[దస్త్రం:filterpress.jpg|thumb|right|ఫిల్టరుప్రెస్సు.]]
బ్లిచింగ్‌ ద్వారా [[నూనె]] కలరును తగ్గించడ జరుగుతుంది.బ్లించింగ్‌ కూడా రెండు రకాలు, 1.బ్యాచ్‌పద్ధతి, 2.కంటిన్యూయన్ పద్ధతి. పామాయిల్‌ను కంటిన్యూయస్‌ బ్లిచింగ్‌ పద్ధతిలోనె బ్లీచ్ చెయ్యుదురు.
బ్లిచింగ్‌సెక్షనులో 1.ఎర్తుమిక్చరు,2.బ్లిచరు,3.ఫిల్టరు లు వుండును.
 
===.ఎర్తు మిక్చరు===
ఎర్తు మిక్చరు ఎం.ఎస్.లేదా ఎస్.ఎస్.తో చేసిన స్తుపాకారపాత్ర. నూనెను కలియతిప్పుటకై అజిటెటరు వుండును.ఎర్తు మిక్చరులో పామాయిల్‌కు కావల్సిన ప్రమాణంలో బ్లిచింగ్‌ ఎర్తును కలుపుతారు. బ్లిచింగ్‌ఎర్తు నూనెలోని కలరు పదార్థాలను శోషించుకొని, రంగును తగ్గించును.బ్లిచింగ్‌ఎర్తును పుల్లర్స్‌ఎర్తు నుండి తయారు చెయ్యుదురు.
 
===బ్లిచింగ్/పుల్లర్స్‌ఎర్తులు===
బ్లిచింగు ఎర్తు/బ్లిచింగు మట్టి హైడ్రెటెడ్‌ సోడియం సిలికెట్‌యొక్క సమ్మేళన పదార్థం.బ్లిచింగ్‌ ఎర్తును బెంటొనైట్‌, అట్టపుల్లిట్, మొంట్‌ మొరిల్లొనైట్‌^ల నుండి చేయుదురు. బ్లిచింగ్‌ ఎర్తులో అధికశాతంలో సిలికేట్స్, అల్యుమినా వుండును. సిలికాన్‌డైఅక్షైడ్‌ 65-70%. .అల్యుమిన 10-15%, మెగ్నిసియమ్, కాల్సియం, ఫెర్రస్‌లన్ని కల్పి 10-15% వుండును. పుల్లర్స్‌ఎర్తునూ వేడిచేసి అక్టీవెట్‌చెయుదురు. ఇలా చేసిన ఎర్తులను నాచురల్ బ్లిచింగ్ ఎర్తులందురు. అక్టివెట్‌చేసిన బ్లిచింగ్‌ఎర్తుల ఉపరితల వైశాల్యం 40-120m<sup>2</sup>/g వుండును. అదే సల్ప్యురిక్‌ ఆసిడ్, లేదా హైడ్రొక్లొరిక్‌ ఆసిడ్ తో అక్టివెట్‌ చేసిన ఎర్తుల ఉపరితలవైశాల్యం 250-300m <sup>2</sup>/g వుండును. అసిడ్‌అక్టివేటెడ్‌ ఎర్తులనే రిఫైనరిలలో వుపయోగిస్తున్నారు. బ్లిచింగ్‌ఎర్తులో ప్రి మాయిచ్చరు 13-18% వుండును. బల్క్‌డెన్సిటి:0.48-0.56 వుండును. కాంపాక్టెడ్‌ బల్క్‌డెన్సిటి: 0.88-0.91 వుండును. 200 నెంబరు మెష్‌లో 75% జల్లింపు అయ్యెలా ఎర్తుసైజు వుండాలి.
 
మిక్చరుకు వచ్చిన పామాయిల్‌ అయిల్‌ ఫ్లోరేటును బట్టి ఎర్తు డోసింగ్/మోతాదు వుండును. ఒకటన్ను నూనెకు 10కే.జి.ల బ్లిచింగ్‌ ఎర్తును కలుపుతారు. బ్లిచింగ్‌ ఎర్తును కలిపిన తరువాత నూనెను బ్లిచరుకు పంపెదరు.
 
===బ్లిచరు===
 
బ్లిచరు ఎస్.ఎస్.తోచేసిన నిలువుగావున్న స్తుపాకారాపాత్ర.నూనెను కలియతిప్పుటకై లోపల మెకానికల్‌అజిటెటరు లేదా ఓపన్‌స్టీము అజిటెసనుసిస్టము వుండును. బ్లిచరులో మొదట 600-650mm/Hg వ్యాక్యుంను, జెట్‌ స్టిముఎజెక్టరులద్వారా సృష్టించెదరు. నూనెను వాతావరణ ఉష్ణోగ్రతలో 100<sup>0</sup>C మించి వేడిచేసిన, గాలిలోని అక్సిజనుతో కల్సి ఆక్షీకరణ చెందును. బ్లిచరులో నూనెను 110-115<sup>0</sup>C వరకు వేడిచెయ్యవలసి ఉంది.అందుచే బ్లిచరులో వ్యాక్యుం అవసరం.బ్లిచరులో నూనెను110-115<sup>0</sup>C వరకు స్టీముకాయిల్స్‌ద్వారా వేడి చేసి, 25-30 నిమిషాలసేపు బ్లిచరులో కలియతిప్పుదురు. ఈసమయంలో నూనెలోని రంగుపదార్థములు బ్లిచింగ్‌ఎర్తు వలన శోషింపబడును. బ్లిచింగ్‌అయిన నూనెను ఫిల్టరుప్రెస్‌లకు పంపి, ఫిల్టరుచేసి, బ్లిచింగ్‌ ఎర్తును తొలగించెదరు.
 
===ఫిల్టరు ప్రెస్===
 
మాములుగా నూనె గింజల నూనెను ఫిల్టరుచెయ్యుటకు ప్రేమ్‌‍‍‍‍ &ప్లెట్‌ రకపు ఫిల్టరు ప్రెస్‌లను వాడెదరు.ప్రెమ్&ప్లేట్‌ ఫిల్టరులను కాస్ట్ట్‌ ఐరన్ లేదా పాలిప్రొపలిన్‌తో చెయుదురు. పామాయి బ్లిచ్డ్‌నూనెను నిలువుగా వుండే ప్రెసరు లీప్‌ ఫిల్టరులలో ఫిల్టరు చెయుదురు. ప్రెసరు లీప్‌ఫిల్టరు షెల్‌ (బయటి భాగం) ఎమ్.ఎస్, తో చెయ్యబడి, స్తుపాకారంగా వుండి, శంకువు వంటి అడుగుభాగంవుండును. లోపల ఎస్, ఎస్, ఫిల్టరు మెష్‌లున్న ఫిల్టరులీప్ ప్రేమ్‌ లుండును. ఫిల్టరు కెపాసిటిని అనుసరించి, షెల్‌సైజు, ఫిల్తరుల సైజు, సంఖ్య పెరుగును. బ్లిచ్డ్‌అయిల్‌ను ఫిల్టరుప్రెసుకు పంపినప్పుడు, ఎస్, ఎస్, ఫిల్టరుమెష్‌వెలుపలివైపున ఎర్తుపూతలా ఏర్పడేవరకు నూనె మబ్బుగా (cloudy) వచ్చును. ఎర్తుపూతగా ఏర్పడిన పిమ్మట, ఫిల్టరు అయిన క్లియరునూనె మెష్‌లోపలనుండి మెష్‌ ప్రెమ్‌లకున్న రంధ్రంల ద్వారా బయటకు వచ్చును.ఫిల్టరుఅయిన బ్లిచ్డ్‌పామాయిల్‌ను బ్లిచ్డ్‌ఆయిల్‌స్టొరేజి టాంకునకు పంపెదరు. ఫిల్టరు షెల్‌లోనిఎర్తును స్'పెంట్‌ఎర్తు'. స్పెంట్‌ఎర్తు/వాడిన ఎర్తును స్టీముద్వారా డ్రై చేసి, బయటకు వదిలెదరు.స్పెంట్‌ బ్లిచింగ్‌ఎర్తులో20-25%వరకు నూనె శోషింపబడివుండును. స్పెంట్‌ఎర్తులోని నూనెను సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్‌ ద్వారా తీయుదురు. స్పెంట్‌ఎర్తు నుండి తీసిన నూనె తిరిగి రిఫైండ్‌ చెయుటకు పనికిరాదు.స్పెంట్‌ఎర్తునుండి తీసిననూనెను సబ్బులు, ఫ్యాటిఆసిడులు తయారుచేయుటకు వాడెదరు.
 
==డి అసిడిఫికెసను(de acidification)==
 
బ్లిచింగ్‌ చేసిన పామాయిల్‌ను డిఅసిడిఫియరుకు పంపి, ఆయిల్‌లోని ఫ్రీఫ్యాటి ఆసిడులను వేపరులగా మార్చి తొలగించి, కలరు పెగ్మెంట్స్‌ను హీట్‌బ్లీచ్‌చేసి నూనె రంగును తగ్గించెదరు.డిఅసిడిఫైయరు ఎస్.ఎస్. తోచెయ్యబడి, స్తుపాకారంగావుండి,4-6 కంపార్టుమెంటులను కలిగి వుండును.ప్రతి కంపార్టుమెంటు కూడ చిన్నగదులుగా విభజింపబడి వుండును.ఇలా చిన్నగదులుగా వుండటంవలన నూనెఎక్కువ సమయం వుండుట వలన డి అసిడిఫికెసను బాగా సమర్ధవంతంగా జరుగును.ప్రతి కంపార్టుమెంటులో వేపరులను గ్రహించుటకై వేపరు గొట్టాలుండును.పైనున్న రెండు కంపార్టుమెంటులలో అడుగున నూనెను వేడియుటకు థెర్మొఫ్లుయిడ్ హిటింగ్‌ కాయిల్‌ వుండును. డిఅసిడిఫైయరు 756-758mm/Hg వ్యాక్యుంలో(1-2 మి.మీ ప్రెసరులో) వుండును. వ్యాక్యుంను హైవ్యాక్యుం మల్టి స్టెజి స్టిమ్‌ ఎజెక్టరుల ద్వారా సృష్టించెదరు.డిఆసిడిఫైయరులో జరుగు చర్యలను గమనించుటకై వ్యూ గ్లాసులుండును.బ్లిచ్డ్‌ ఆయిల్‌ను మొదట 90-95<sup>0</sup>C వరకు వేడిచేసి, డిఎయిరెటరుకు పంపి నూనెలోని గాలిని తొలగించెదరు. డి ఎయిరెటరు కూడా పూర్తివ్యాక్యుంలో వుండును.రిఫైండ్అయ్యి డి అసిడిఫైయరు నుండి వచ్చునూనె ఉష్ణోగ్రత 200-215<sup>0</sup>Cవరకు వుండును.డిఎయిరెటరు గుండా బయటకువచ్చు నూనెను హీట్‌ఎక్సెంజరు కాయిలుల ద్వారా, డి అసిడిఫైయరునుండి వచ్చునూనెద్వారా140-150<sup>0</sup>C వరకు వేడిచేయుదురు.ఈ విధంగా 140-150<sup>0</sup>Cవరకు వేడెక్కిన నూనెను థెర్మొఫ్లుయిడ్‌ హీట్‌ఎక్సెంజరుకు పంపి 240-250<sup></sup>C వరకు వేడిచెయుదురు.ఈ ఉష్ణోగ్రతలో వున్న నూనెను మొదట ప్రి డిస్టిలరుకు పంపెదరు.ప్రిడిస్టిలరు కూడా ఎస్.ఎస్.చేయబడి, థెర్మొ ఫ్లుయిడ్‌ హీటింగ్‌ కాయిల్స్, ఒపన్‌ స్టీమ్‌కాయిల్స్ కలిగివుండును. ప్రిడిస్టిలరుకూడా పూర్తి వ్యాక్యుంలోవుండి, దీని వేపరుల గొట్టం, డి అసిడిఫయరు వేపరు గొట్టానికి అనుసంధానించి వుండును.ఈ రెండు వేపరుగొట్టాలు ఫ్యాటిఆసిడ్ స్క్రబ్బరుకు క్రిందిభాగంలో షెల్‌కు పక్కభాగంలో కలుపబడివుండును.స్క్రబ్బరు పైభాగంనుండి ఒకగొట్టం వ్యాక్యుం తయారుచెయ్యు ఎజెక్టరులకు కలుపబడి వుండు ను. ప్రిడిస్టిలరుకు వచ్చిననూనెను సూపరుహీటెడ్‌ ఒపను స్టీము ద్వారా బాగా కలియబెట్టడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు (కొవ్వు ఆమ్లాలు) వేపరులగా మారి ఫ్యాటి ఆసిడ్‌ స్క్రబ్బరుకు వేపరు గొట్టాంద్వారా వెళ్ళును. ప్రిడిస్టిలరులో 75-85% వరకు ఫ్యాటిఆమ్లాలు తొలగింపబడును.ఫ్యాటిఅమ్లాలు వేపరులుగా మారడం వలన నూనె ఉష్ణోగ్రత తగ్గును.థెర్మొఫ్లుయిడ్‌కాయిలులద్వారావేడిచేసి నూనె ఊష్ణొగ్రతను240-250<sup>0</sup>Cకు పెంచదరు. ప్రిడిస్టిలరులో కొంత నియమిత ఎత్తువరకు నూనెనిల్వవుండి, మిగతా నూనె ఒక సైపను ద్వారా డి అసిడిఫయరు యొక్క పైభాగంలోని కంపార్టుమెంటుకు ప్రవహించును. డిఅసిడిఫైయరులో నూనె క్రమంగా ఒక కంపార్టుమెంటు నుండి దిగువ కంపార్టుమెంటుకువెళ్ళును,రెండో గది నుండి మూడో గదికి,అక్కడి నుండీ నల్గవగదికి అలావరుస క్రమంగా దిగువన వున్న చివరి కంపార్టుమెంటుకు వెళ్ళును. ప్రతి కంపార్టుమెంటులో తయారగు వేపరులన్ని డిఅసిడిఫైయరు కున్న వేపరు గొట్టానికి వెళ్ళెలా, గది మధ్యలో వేపరు గొట్టాలు వుండును.అలాగే గదులలోని నూనె బాగా అజిటెసను చేయ్యుటకై సూపరు హీటెడ్‌ ఒపను స్టీముకాయిల్స్ వుండును.నూనెను కలియతిప్పడం వలన, పైభాగంలోనున్ననూనె గది క్రిందికి, క్రిందినూనె పైకి వెళ్లడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు, కలరు పిగ్మెంట్స్‌ త్వరగా వేపరులూగా మారును.అతి తక్కువ పీడనం వద్ద (2-4టారు) ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద కొన్నిరకాల కలరుపిగ్మెంటులు, హీట్‌బ్లీఛ్‌ వలన రంగునుకోల్పొవును.2-4టారు పీడనం756-758mm/Hg వ్యాక్యుంకు సమానం.ఫ్యాటిఆమ్లాలు, రంగుకారక పధార్థాలతో పాటు, నూనెలోని వాసన కారక పదార్థాలు కూడా తొలగింపబడును.పూర్తిగా రిఫైండు అయ్యిక్రింది కంపార్టుమెంటునుండి బయటకు వచ్చునూనెను మొదట హీట్‌ఎక్సెంజరుకు పంపి, బ్లిచ్డ్‌అయిల్‌ను వేడిచేసిన తరువాత, కండెన్సరుకు పంపి 45-50<sup>) </sup>Cకు చల్లార్చి స్టొరేజి టాంకునకు పంపెదరు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2506899" నుండి వెలికితీశారు