సారంగధర (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 50:
వేంగి రాజ్యాన్ని పాలించే చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు (ఎస్వి రంగారావు). మహారాణి రత్నాంగి (శాంతకుమారి). యువరాజు సారంగధరుడు (ఎన్టి రామారావు). మహామంత్రి సింగన్న (గుమ్మడి). మంత్రి కుమారుడు సుబుద్ది (చలం), మాండవ్యుడు (రేలంగి) యువరాజు మిత్రులు. వేంగి రాజ్యానికి సామంతుడు మంగరాజు (సివివి పంతులు). అతని కుమార్తె కనకాంగి (రాజసులోచన), యువరాజు పరస్పర అనురాగబద్దులవుతారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజు (ఏవి సుబ్బారావు సీనియర్) వద్దకు శాంతికోసం యువరాజు రాయబారిగా వెళ్తాడు. దారిలో చిత్రాంగి (భానుమతి) యువరాజును చూసి ప్రేమిస్తుంది. సంధి ఒప్పందం తరువాత రాజ్యానికి వెళ్లిన యువరాజుకు వివాహం కోసం రాజరాజు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి చిత్రాంగి పెళ్లికి అంగీకరిస్తుంది. కాని కనకాంగిపట్ల అనురక్తుడైన యువరాజు వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే మంత్రి గంగన్న (ముక్కామల) కుయుక్తివలన రాజరాజు చిత్రాంగిని (కత్తికి మాలవేయించి) వివాహం చేసుకుంటాడు. జరిగిన మోసం తెలుసుకున్న చిత్రాంగి, వ్రతం పేరుతో రాజరాజును దూరంగావుంచి చెలికత్తె మల్లిక (సురభి బాలసరస్వతి) సాయంతో పావురాల ఆట ద్వారా సారంగధరుని తన భవనానికి రప్పించి తన ప్రేమను వెల్లడిస్తుంది. తన తల్లివలెనే భావిస్తున్నానని సారంగధరుడు చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు. భంగపాటుతో కోపానికి గురైన చిత్రాంగి, సారంగధరుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని రాజరాజుకు చెబుతుంది. మహారాజు ఆగ్రహానికి గురై సారంగుని కాళ్లుచేతులు నరికించమని శిక్ష విధిస్తాడు. సుబుద్ధి సాయంతో నిజం తెలుసుకున్న రాజరాజు శిక్ష నిలుపుదల చేయమంటాడు. అయితే గంగన్న శిక్షను త్వరగా అమలుపర్చడంతో సారంగధరుడు మరణిస్తాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన చిత్రాంగి ఆత్మత్యాగం చేసుకుంటుంది. తల్లి రత్నాంగి, ప్రియురాలు కనకాంగి, యువరాజుకై విలపిస్తుండగా ఓ సాధువు వచ్చి మంత్రజలంతో యువరాజును బతికిస్తాడు. కనకాంగిని వివాహం చేసుకున్న సారంగధరుడు వేంగి రాజ్య సింహాసనం అధిష్టించి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందటంతో చిత్రం సుఖాంతమవుతుంది<ref>{{cite news |last1=సివిఆర్ మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 సారంగధర |url=http://www.andhrabhoomi.net/content/flashback50-36 |accessdate=10 December 2018 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=8 December 2018}}</ref>..
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb title|0259553}}
|