సారంగధర (1957 సినిమా)

సారంగధర మినర్వా పతాకంపై ఎన్‌టి రామారావు, భానుమతిల కాంబినేషన్‌తో రూపొందించిన చిత్రం. ఈ కథను తొలుత 1930లో వై.వి. రావు మూకీ చిత్రంగా ‘జనరల్ కార్పొరేషన్’పై మద్రాస్‌లో రూపొందించాడు. తమిళంలో 1935లో టాకీ చిత్రంగా దర్శకులు విఎస్‌కె పాథమ్, కొత్తమంగళం శీను, టిఎం శారదాంబల్ కాంబినేషన్‌లో ‘సారంగధర’ నిర్మించారు. తమిళంలోనే మరోసారి నవీన ‘సారంగధర’ పేరిట మరోచిత్రం ఎంకె త్యాగరాజు భాగవతార్, ఎస్‌డి సుబ్బలక్ష్మిలతో రూపొందించారు. 1937లో తెలుగులో స్వామి పిళ్లై, రామయ్య అనే నిర్మాతలు స్టార్ కంబైన్స్ బ్యానర్‌పై పి.పుల్లయ్య దర్శకత్వంలో బొంబాయిలో నిర్మించారు. ఆ చిత్రానికి బందా కనకలింగేశ్వరరావు (సారంగధరునిగా), పి.శాంతకుమారి (చిత్రాంగి), అద్దంకి శ్రీరామమూర్తి రాజరాజనరేంద్రునిగా, పులిపాటి వెంకటేశ్వర్లు సుబుద్దిగా నటించగా తాపీ ధర్మారావు రచన, ఆకుల నరసింహారావు సంగీతం సమకూర్చారు.

సారంగధర
(1957 తెలుగు సినిమా)
Saarangadhara.jpg
దర్శకత్వం వి.ఎస్.రాఘవన్,
కె.ఎస్. రామచంద్రరావు
నిర్మాణం టి.నామదేవరెడ్డి
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి,
ఎస్.వి.రంగారావు
సంగీతం ఘంటసాల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
కళ ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణ సంస్థ మినర్వా ప్రొడక్షన్స్
విడుదల తేదీ నవంబర్ 1, 1957
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

కథసవరించు

వేంగి రాజ్యాన్ని పాలించే చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు (ఎస్‌వి రంగారావు). మహారాణి రత్నాంగి (శాంతకుమారి). యువరాజు సారంగధరుడు (ఎన్‌టి రామారావు). మహామంత్రి సింగన్న (గుమ్మడి). మంత్రి కుమారుడు సుబుద్ది (చలం), మాండవ్యుడు (రేలంగి) యువరాజు మిత్రులు. వేంగి రాజ్యానికి సామంతుడు మంగరాజు (సివివి పంతులు). అతని కుమార్తె కనకాంగి (రాజసులోచన), యువరాజు పరస్పర అనురాగబద్దులవుతారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజు (ఏవి సుబ్బారావు సీనియర్) వద్దకు శాంతికోసం యువరాజు రాయబారిగా వెళ్తాడు. దారిలో చిత్రాంగి (భానుమతి) యువరాజును చూసి ప్రేమిస్తుంది. సంధి ఒప్పందం తరువాత రాజ్యానికి వెళ్లిన యువరాజుకు వివాహం కోసం రాజరాజు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి చిత్రాంగి పెళ్లికి అంగీకరిస్తుంది. కాని కనకాంగిపట్ల అనురక్తుడైన యువరాజు వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే మంత్రి గంగన్న (ముక్కామల) కుయుక్తివలన రాజరాజు చిత్రాంగిని (కత్తికి మాలవేయించి) వివాహం చేసుకుంటాడు. జరిగిన మోసం తెలుసుకున్న చిత్రాంగి, వ్రతం పేరుతో రాజరాజును దూరంగావుంచి చెలికత్తె మల్లిక (సురభి బాలసరస్వతి) సాయంతో పావురాల ఆట ద్వారా సారంగధరుని తన భవనానికి రప్పించి తన ప్రేమను వెల్లడిస్తుంది. తన తల్లివలెనే భావిస్తున్నానని సారంగధరుడు చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు. భంగపాటుతో కోపానికి గురైన చిత్రాంగి, సారంగధరుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని రాజరాజుకు చెబుతుంది. మహారాజు ఆగ్రహానికి గురై సారంగుని కాళ్లుచేతులు నరికించమని శిక్ష విధిస్తాడు. సుబుద్ధి సాయంతో నిజం తెలుసుకున్న రాజరాజు శిక్ష నిలుపుదల చేయమంటాడు. అయితే గంగన్న శిక్షను త్వరగా అమలుపర్చడంతో సారంగధరుడు మరణిస్తాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన చిత్రాంగి ఆత్మత్యాగం చేసుకుంటుంది. తల్లి రత్నాంగి, ప్రియురాలు కనకాంగి, యువరాజుకై విలపిస్తుండగా ఓ సాధువు వచ్చి మంత్రజలంతో యువరాజును బతికిస్తాడు. కనకాంగిని వివాహం చేసుకున్న సారంగధరుడు వేంగి రాజ్య సింహాసనం అధిష్టించి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1]..

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలను సముద్రాల జూనియర్ రచించగా ఘంటసాల బాణీలు కూర్చాడు.[2]

 1. అడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు - పి. భానుమతి
 2. అన్నాని భామిని ఏమని ఎపుడైనా అన్నానా భామిని - ఘంటసాల,పి. లీల
 3. అల్లన గాధిరాజసుతుడల్మిని ( సంవాద పద్యాలు ) - పి. భానుమతి,ఘంటసాల
 4. ఎక్కడి దిరుపులపై పోవంగ గడగియున్న ( పద్యం ) - ఎం. ఎస్. రామారావు
 5. ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ ఒక్కసారి నన్ను చూడు - స్వర్ణలత,పిఠాపురం
 6. ఓ నారాజ ఇటు చూడవోయీ నేనోయి నీకిల వలదోయీ - పి. భానుమతి
 7. కలలు కరిగిపోవునా అలముకొనిన ఆశలిటులే - పి. శాంతకుమారి,జిక్కి,ఘంటసాల
 8. కావక రాజు చిత్తము వకావకలై తెగజూచినట్టుల విపరీత ( పద్యం ) - ఘంటసాల
 9. గగన సీమంతిని కంఠహారములోన దనరారు ( పద్యం ) - ఘంటసాల
 10. జగము నా శీలమ్ము సత్యము గమనించి నన్ను దోషిగ ( పద్యం ) - ఘంటసాల
 11. జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి - పి. లీల
 12. తగిలె ఎరయో భుజయో దైవ వశమున ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
 13. ధనలుఫ్తుల వృత్తుల కూర్పున వారల ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
 14. నను నీ గోత్రీజు నేచనేలయనుటలో ( పద్యం ) - మాధవపెద్ది
 15. పోయిరా మాయమ్మా పొయిరావమ్మా పోయిరా మాయమ్మా బంగారు - పి. లీల బృందం
 16. మంగళము మంగళము మంగళమనరే మంగళమని పాడరె - బృందం
 17. రాజిపుడూరలేడు చెలి ప్రాయపు బిత్తరి నీవు రూపు రేఖ ( పద్యం ) - మాధవపెద్ది
 18. వన్నె చిన్నె గువ్వా సన్నజాజి పువ్వా - పిఠాపురం,పి. లీల బృందం
 19. వలదమ్మా ఇటువంటి కానిపని ఓ వామాక్షి ( పద్యం ) - ఘంటసాల
 20. సకల భూతములయందు శ్రద్ద ( పద్యం ) - ఎం.ఎస్. రామారావు
 21. సాగెను బాల ఈ సంధ్య వేళా రాగాల డోల మహానంద - జిక్కి
 22. మనసేమో మాటలలో దినునేమో - పి. భానుమతి

మూలాలుసవరించు

 1. సివిఆర్ మాణిక్యేశ్వరి (8 December 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 సారంగధర". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 10 December 2018.
 2. కొల్లూరి భాస్కరరావు. "సారంగధర - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 3 ఏప్రిల్ 2012. Retrieved 30 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులుసవరించు