కండ్లగుంట (నకరికల్లు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 241:
===కండ్లగుంటలో వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక===
 
వందల సంవత్సరాలుగా మురుగుకుంటో, మరుగుదొడ్డో, శ్మశానమో గుర్తుపట్టలేనంతగా ఉండే ఊరి శ్మశానవాటిక కనీస సౌకర్యాలు ఉంటే బావుంటుంది అనుకునేవారు పెమ్మసాని బ్రహ్మయ్య. శ్మశానవాటిక నిర్మాణానికి 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా..” ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బ్రహ్మయ్య అతని సంకల్పాన్ని ప్రకటించారు. అందమైన స్వాగత తోరణం నుంచి లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడు, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుడు, సత్యహరిశ్చంద్రుని విగ్రహాలు, స్నానాలు చేయడానికి ప్రత్యేక గదులు, వేచి ఉండడానికి విశాలమైన ప్రాంగణం, కాటికాపరికి ప్రత్యేక గది, ఫాన్లు, విద్యుత్తు లైటులు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని మొక్కలతో ఓ అద్భుతమైన హరితవనంలాగా తీర్చిదిద్ది, అంత్యక్రియలకు అవసరమైన సకల సదుపాయాలతో అత్యుత్తమ కళాత్మకమైన 'వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక’ను బ్రహ్మయ్య నిర్మించాడు.ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గుంటూరు కొత్తపేట సి.ఐ. దిరిసైల వెంకన్నచౌదరి చేతులమీదుగా 2016, జనవరి-15న గ్రామ ప్రజలకు అంకితం చేసారు.
 
===ధర్మ సత్రం===