రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

చి 103.69.77.30 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 33:
శ్రీ చక్ర విలసవము అను గ్రంథములో [[శ్రీ చక్రం|శ్రీ చక్ర]] అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి [[ఇంద్రుడు]] మహా యజ్ఞము చేసెను. ఆ [[యజ్ఞము]]<nowiki/>న దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన [[శ్రీదేవి]] కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. [[శ్రీదేవి]] జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల [[కోటిలింగాల|కోటిలింగ]] క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.).
 
1
==సంస్కృతి==
 
===చలనచిత్ర రంగం===
 
''దుర్గా సినీటౌన్'', [[దక్షిణ భారతదేశము]]లోని మొట్టమొదటి సినిమా స్టూడియో, ఈ స్టూడియో 1936లొ నిడమర్తి సూరయ్య గారిచే స్థాపించబడింది.<ref>{{cite book|last1=Ram|first1=P|title=Life in India|date=2014|publisher=AnVi|page=153|url=https://books.google.co.in/books?id=OjT4BQAAQBAJ&pg=PA153&lpg=PA153&dq=First+Film+Studio+of+Andhra+Pradesh-%5B1936,+Rajahmundry&source=bl&ots=rAZ9vWPJBT&sig=47mdBIEv93GduOy69FbF_vlUwNU&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q=First%20Film%20Studio%20of%20Andhra%20Pradesh-%5B1936%2C%20Rajahmundry&f=false|accessdate=2 July 2016|language=en}}</ref>
 
రాజమండ్రి నగరంలో సుమారు 9 సినిమా హాల్స్ కలవు
 
=== కళ మరియు క్రాఫ్ట్ ===
 
ఇక్కడ చిత్రలేఖనంలో ప్రపంచ ఖ్యాతి పొందిన ''దామోర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ'' ఉంది. ఇక్కడ దామోర్ల రామారావు గారి చిత్రాల్లో ముఖ్యమైన ''కృష్ణ లీల'', ''తూర్పు కనుమల గోదావరీ'' మరియు ''కథియవార్'', [[గౌతమ బుద్ధుడు]] పై ''సిధ్ధార్ద రాగొద్యం'', [[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల పై ''నంది పూజ'' చిత్రాలు భద్రపరిచారు.<ref>{{cite news|title=Damerla Rama Rao Art Gallery: a picture of neglect|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/damerla-rama-rao-art-gallery-a-picture-of-neglect/article7523945.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=11 August 2015|language=en-IN}}</ref>
 
=== గోదావరి పుష్కరాలు ===
{{Main|2015 గోదావరి పుష్కరాలు}}
[[పుష్కరము]] అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. రాజమండ్రిలో గత పుష్కరాలు 2015లొ జరిగాయి.<ref>{{cite web|title=Godavari Pushkaralu 2|url=http://godavaripushkaralu.co.in/index.html|website=godavaripushkaralu.co.in|accessdate=2 July 2016}}</ref> దీని కోసం నిర్మించిన ''కోటి లింగాల ఘాట్'' ముఖ్యమైనది, దీనిని ''అఖండ గోదావరి ప్రాజెక్ట్'' ద్వారా ఆధునీకరిస్తున్నారు.<ref>{{cite news|title=Iconic Kotilingala Ghat loses its sheen|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/iconic-kotilingala-ghat-loses-its-sheen/article8293818.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=26 February 2016}}</ref>
 
=== నగరం గురించిన ప్రస్థావన===
 
'''ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రలో'''
 
''యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య:ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు భయిలుపడదు అన్నవతుగా యీ [[ప్రపంచము]] కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ 'కష్నతి కష్నతి కష్న త్యేన ' అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేస్తోంది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించింది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను భయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి ఒక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసాడు. ఆ ధారకు, గొదావరి అని [[నామకరణము]] చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్థించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే [[భూములు]] గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా ఉన్నాయి.''
 
యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తుతన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్థించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే [[వాడపల్లి]] రాత్రి 7 గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే ఒక మనిషి నడిచేపాటి కాలిదారిగా ఉంది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు 6 కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా ఒకటి ఉంది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా ఉంది. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టి ఉన్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో [[బావులు]]<nowiki/>లేవు.''
 
* రాజరాజనరేంద్రుని పరిపాలన
* [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలన
* రెడ్డిరాజుల, గజపతి రాజుల పరిపాలన
* ఆంగ్లేయుల పరిపాలన
* ఫ్రెంచ్ పరిపాలన
 
== ముఖ్య సందర్శనీయ ప్రదేశములు మరియు దేవాలయములు ==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు