దేవులపల్లి కృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

+ మూలం
పంక్తి 50:
తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని [[పిఠాపురం]] రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.
 
1929లో విశ్వకవి [[రవీంద్రనాధ టాగూరు]]తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో [[కాకినాడ]] కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో [[బి.ఎన్.రెడ్డి]] ప్రోత్సాహంతో [[మల్లీశ్వరి]] చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో [[ఆకాశవాణి]]లో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.<ref name="ప్రసార ప్రముఖులు కృష్ణశాస్త్రి">{{cite wikisource |last1=రేవూరి |first1=అనంత పద్మనాభరావు |title=ప్రసార ప్రముఖులు |chapter=హైదరాబాదు కేంద్రం |year=1996}}</ref><ref name="వాకిలి దేవులపల్లి">{{cite web |last1=రామసూరి |first1=సీతారామయ్య |title=కృష్ణశాస్త్రి జీవితం – సాంస్కృతిక నేపథ్యం |url=http://vaakili.com/patrika/?p=12606 |website=వాకిలి |accessdate=28 December 2018}}</ref>
 
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... [[బి.ఎన్.రెడ్డి]] ప్రోత్సాహంతో ‘[[మల్లీశ్వరి]] (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని [[శ్రీశ్రీ]] శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. [[రాజమకుటం]], [[సుఖదుఃఖాలు]], కలిసిన మనసులు, [[అమెరికా అమ్మాయి]], [[గోరింటాకు]] మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.