కమలాకర కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఇక మానసంరక్షణం చిత్రానికి [[ఎన్.జగన్నాథ్]] దర్శకత్వం వహించాడు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది [[బళ్ళారి రాఘవ]] కాగా అందులో [[యడవల్లి సూర్యనారాయణ]]. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణం లో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశాడు.
 
ఈ విమర్శలను [[నార్ల వెంకటేశ్వరరావు]], [[గూడవల్లి రామబ్రహ్మం]] లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం 'వస్త్రాపహరణం ' సినిమాలో పని చేశాడు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నాడు! ఈ 'వస్త్రాపహరణం ', 'మానసంరక్షణం ' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వర రావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.
 
హెచ్.ఎం.రెడ్డి '[[కనకతార]]' తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు [[మద్రాసు]] వచ్చాడు. తాను 'సినీఫాన్' అనే పేరుతో కృష్ణా పత్రికలో సినిమాల గురించి విమర్శలు వ్రాస్తూ ఉంటానని చెప్పి 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - వాటిల్లో ఆర్థికంగా హిట్టైనా సరే, బాగాలేదని తాను వ్రాసిన వస్త్రాపహరణం సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి! కానీ విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన.