మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
== విడుదల, స్పందన ==
సమకాలీన సాంఘికాంశాల మీద అభ్యుదయకరమైన సినిమాలు తీసి పేరుతెచ్చుకున్న గూడవల్లి రామబ్రహ్మం తన సినిమాల వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, సినిమా రంగంలో నిలబడడానికి మాత్రమే ఈ సినిమా తీశానని చెప్పుకున్నాడు. తన స్థాయికి తగిన సబ్జెక్టు కాదని భావించిన రామబ్రహ్మం తాను ఎప్పుడూ చేసినట్టు కాక ప్రీమియర్ షోను వేరే థియేటర్‌లో వేశాడు.<ref name=":1" /> రచయిత, సినీ విమర్శకుడు [[కొడవటిగంటి కుటుంబరావు]] ఈ సినిమా చూపించమంటే విజయం పొందిన సినిమా దర్శకుడిగా గర్వించకపోగా, "అది మీరు చూడవలసిన పిక్చర్ కాదులే, బ్రదర్" అని అవమానభారంతో సిగ్గుపడ్డాడు.{{sfn|జగన్మోహన్|2011|pp=134}} మెట్టు దిగివచ్చి ఈ సినిమాని తీసిన రామబ్రహ్మానికి ఆశించిన ఆర్థిక ఫలితం మాత్రం దక్కింది. సినిమా ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్‌లో చిత్రీకరించినా, పెట్టిన పెట్టుబడికి మించి కలెక్షన్లు సాధించి రామబ్రహ్మానికి ఉపశమనం ఇచ్చింది.<ref name=":1" />{{sfn|జగన్మోహన్|2011|pp=133}}
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు