మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
=== అభివృద్ధి ===
తన సినిమాలు ఆర్థికంగా దెబ్బతిని, ఇబ్బందులకు గురిచేస్తూండడంతో సాంఘిక చిత్రాలే తప్ప జానపద, పౌరాణిక చిత్రాలు తీసి ఎరుగని గూడవల్లి రామబ్రహ్మం తొలిసారిగా ఈ జానపద చిత్రానికి దర్శకత్వం వహించాడు. జనం నోట్లో నానిన "కాంభోజరాజు కథ" అన్న జానపద కథను తీసుకుని, త్రిపురనేని గోపీచంద్‌తో మెరుగులు దిద్దించి, దైతా గోపాలంతో సంభాషణలు, పాటలు రాయించుకుని ఈ స్క్రిప్టు తయారుచేయించాడు. తర్వాతికాలంలో కాంభోజ రాజు కథ పేరుతో శోభన్ బాబు హీరోగా మళ్ళీ ఈ కథను సినిమాగా తీశారు. రామబ్రహ్మం ప్రజామిత్ర పత్రిక సంపాదకునిగా ఉన్న రోజుల్లో చదివిన జానపద కథల పుస్తకం పేరు "మాయలోకం", అప్పట్లో ఇది సినిమాకు పేరుగా బావుంటుందన్న తన మాట గుర్తుపెట్టుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టాడు.<ref name=":1" /> దేవతలు, రాక్షసులు, మాయలు, మంత్రాలు వంటివి ఉండే జానపద, పౌరాణిక కథాంశాలతో సినిమా తీయడం రామబ్రహ్మం తత్త్వానికి సరిపడే విషయం కాకపోయినా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎలాగో సరిపెట్టుకుని ఈ సినిమా తీశాడు.{{sfn|జగన్మోహన్|2011|pp=133}}
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు