ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
#1Lib1Ref
పంక్తి 20:
==కథ==
[[టెలీఫోను|టెలీ]] మార్కెటింగ్ యాడ్స్ కు [[యాంకర్]]గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ ([[నాగ శౌర్య]]) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ ([[అవసరాల శ్రీనివాస్]]) ప్రవర్తనతో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్ళి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని మెప్పించడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్ళి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్ళి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతిలు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'.
 
== థీమ్స్, ప్రభావాలు ==
''సైరనో దె బెర్గెరాక్‌''‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ''అనీ హాల్'' పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.<ref name="Hindu Review" />
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఊహలు_గుసగుసలాడే" నుండి వెలికితీశారు