"కమ్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Reverted 1 edit by Lillinan1 (talk) identified as vandalism to last revision by Pavan santhosh.s. (TW))
ట్యాగు: రద్దుచెయ్యి
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక సామాజిక వర్గం లేక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులుకమ్మవారు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
 
==చరిత్ర==
[[File:Kaapaneedu.jpg|thumb|కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు]]
=== పుట్టు పూర్వోత్తరాలు ===
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా[[కమ్మనాడు]]గా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు. 1940ల నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని అణచివేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే [[కమ్మనాడు]] సంబంధించిన మిగతా వర్గములను కూడ చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.
==పరిశోధన==
 
ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతము కలదు. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతము కలదు. దీనిని హాప్లో గ్రూపు haplogroup R2 అందురు. ఐరోపా మరియు ఉత్తర భారత ఆర్యులలో హాప్లోగ్రూపు R2 నకు బహుసమీపములో ఉండు హాప్లోగ్రూపు R1a1(M17) కలదు. ఈ పరిశోధన ఇంకా ఎక్కువమంది నమూనాలు సేకరించి నిశితముగా చేయవలిసిన అవసరమున్నది.
 
=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనలములోకమ్మనాయకులు దుర్జయ వంశ, చతుర్థాన్వయ అని పేర్కొనబడ్డారు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.
 
[[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడి అన్నయ మంత్రి|అన్నయ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2604205" నుండి వెలికితీశారు