ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

అస్మాక --> అశ్మక
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
| influenced = [[లల్లా]], [[బాస్కరుడు]], [[బ్రహ్మగుప్తుడు]], [[వరాహమిహిర]]
}}
'''ఆర్యభట్టు''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], [[ఆర్య సిధ్ధాంతం]], [[సూర్య సిద్ధాంతం]], [[గోళాధ్యాయం]], సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]<nowiki/>లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.
 
 
 
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ అనీ, అరబ్బులు అర్జావస్ అనీ వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం [[భారత దేశము|భారత్]] ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు