మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

++===ఢిల్లీ===
→‎ఢిల్లీ: ++===కాన్పూరు===
పంక్తి 122:
 
తొలుత తిరుగుబాటు దార్లు కంపెనీ సైన్యాన్ని తరిమేసి, హర్యానా, బీహార్, కేంద్ర పరగణాలు, ఐక్య పరగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ దళాలను కూడదీసుకుని ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటు దార్లకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. బఖ్త్ ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ, తిరుగుబాటుదార్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయక్త్వంలోనే యుద్ధం చేసారు. వీరిలో కొందరు గట్టిగానే పోరాడినప్పటికీ, మిగతావారు మాత్రం స్వార్థపూరితంగాను, అసమర్ధులుగానూ మిగిలిపోయారు.
[[File:"Attack_of_the_Mutineers_on_the_Redan_Battery_at_Lucknow,_July_30th,_1857,.jpg|link=https://en.wikipedia.org/wiki/File:%22Attack_of_the_Mutineers_on_the_Redan_Battery_at_Lucknow,_July_30th,_1857,.jpg|thumb|Attack1857 ofజూలై the30 mutineers onరెడాన్ theబ్యాటరీపై Redanతిరుగుబాటుదార్ల Battery at Lucknow, 30 July 1857దాడి]]
మీరట్ చుట్టుపట్ల ఉన్న గ్రామీణ ప్రాంతంలో గుర్జర్ల తిరుగుబాటు బ్రిటిషర్లకు అతి పెద్ద బెడద తెచ్చిపెట్టింది. పరీక్షిత్‌గఢ్ లో గుర్జర్లు చౌధురీ కదమ్ సింగ్‌ను తమ నాయకుడిగా ప్రకటించి, కంపెనీ పోలీసులను పారదోలారు. కదమ్ సింగ్ గుర్జర్ 2 వేల నుండి 10 వేల వరకూ ఉన్న పెద్ద సైన్యానికి నాయకత్వం వహించాడు.<ref name="stokes">{{Citation|title=The peasant armed: the Indian revolt of 1857|first1=Eric|last1=Stokes|first2=Christopher Alan|last2=Bayly|publisher=Clarendon Press|year=1986|isbn=978-0-19-821570-7}}</ref> బులంద్‌షహర్ వలిదాద్ ఖాన్ నాయకత్వంలోను, బిజ్‌నోర్ మహో సింగ్ నేతృత్వంలోనూ గుర్జర్ల నియ్ంత్రణ లోకి వచ్చింది. సమకాలికుల నివేదికల ప్రకారం, మీరట్ ఢిల్లీల మధ్య ఉన్న గుర్జర్ల గ్రామాలన్నీ తిరుగుబాటులో పాల్గొన్నాయి. వారికి కొన్ని చోట్ల జలంధర్ మద్దతు లభించింది. జూలై అంతానికి గాని బ్రిటిషర్లు ఈ ప్రాంతంపై నియంత్రణ తెచ్చుకోలేకపోయారు; అది కూడా స్థానిక జాట్‌ల సహాయంతో.<ref name="stokes" />
 
పంక్తి 130:
 
=== ఢిల్లీ ===
[[File:Attack1857.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Attack1857.jpg|thumb|Assaultకాశ్మీరీ ofగేట్ Delhiఆక్రమణ and-1857 capture of the Cashmere Gate,సెప్టెంబరు 14 September 1857]]
తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిషు వారు కొంత మందకొడిగా వ్యవహరించారు. బ్రిటను నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది. చైనా వెళ్ళే దాఅరిలో ఉన్న కొన్ని దళాలను భారత్‌కు మళ్ళించారు.
 
పంక్తి 136:
 
ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకుని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి. జూలై 1 నుండి సెప్టెంబరు 21 దాకా ఈ ముట్టడి కొనసాగింది. అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిషు వారి వద్ద లేదు. తిరుగుబాటు సైన్యం బ్రిటిషు సైన్యం కంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది. ముట్టడిలో ఉన్నది ఢిల్లీ కాదు, బ్రిటిషు సైన్యమా ఆన్నట్టు ఉండేది. తిరుగుబాటుదార్ల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిషు సైన్యం వెనక్కి తగ్గుతుందేమో అన్నట్టుండేది. ఆగస్టు 14 న పంజాబు నుండి బ్రిటిషు, సిక్ఖు, పఖ్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిషు సైన్యాం బలపడింది.<ref>[http://www.hindu.com/mp/2006/10/28/stories/2006102801590100.htm God's Acre]. [[The Hindu]] Metro Plus Delhi. 28 October 2006.</ref><ref>[http://www.jonathanforeman.com/movies/mangal.html 'The Rising: The Ballad of Mangal Pandey'] {{webarchive|url=https://web.archive.org/web/20070714182441/http://www.jonathanforeman.com/movies/mangal.html|date=14 July 2007}}. Daily Mail, 27 August 2005.</ref> <gallery mode="packed">
Fileదస్త్రం:1857 ruins jantar mantar observatory2.jpg|Theధ్వంసమైన [[Jantarజంతర్ Mantar]]మంతర్ observatoryఖగోళ in Delhi inవేధశాల, 1858, damaged in the fighting
Fileదస్త్రం:1857 cashmeri gate delhi.jpg|Mortarమందు damageగుళ్ళతో toధ్వంసమైన [[Kashmiriకాశ్మీరీ Gate (Delhi)|Kashmiri Gate]], Delhiగేట్, 1858
దస్త్రం:1857 hindu raos house2.jpg|పోరులో ధ్వంసమైన హిందూరావ్ ఇల్లు. ప్రస్తుతం దీన్ని ఆసుపత్రిగా మార్చారు
File:1857 hindu raos house2.jpg|[[Raja Hindu Rao|Hindu Rao]]'s house in Delhi, now a hospital, was extensively damaged in the fighting
దస్త్రం:1857 bank of delhi2.jpg|శతఘ్ని గుళ్ళు, తుపాకీ కాల్పుల్లో దెబ్బతిన్న బ్యాంక్ ఆఫ్ ఢిల్లీ
File:1857 bank of delhi2.jpg|Bank of Delhi was attacked by mortar and gunfire
</gallery>సెప్టెంబరు 7 న బ్రిటిషు వారి శతఘ్నులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదార్ల శతఘ్నులను పట్టుకున్నారు.<ref name="HCRE">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|478}} సెప్టెంబరు 14 న కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిషు దళాలు ప్రయత్నించారు.<ref name="HCRE" />{{rp|480}} నగరంలో కాలుమోపినప్పటికీ బ్రిటిషు దళాలకు అపార నష్టం జరిగింది. జాన్ నికోల్సన్ కూడా మరణించాడు. బ్రిటిషు కమాండరు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు. కానీ, అతడి కింది అధికారులు నచ్చజెప్పడంతో పోరు కొనసాగించాడూ. ఒక వారంలో బ్రిటిషు దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి. ఢిల్లీ తిరిగి బ్రిటిషు వారి స్వాధీనమైంది. బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయూన్ సమాధికి పారిపోయాడు.
[[File:"Capture_of_the_King_of_Delhi_by_Captain_Hodson".jpg|link=https://en.wikipedia.org/wiki/File:%22Capture_of_the_King_of_Delhi_by_Captain_Hodson%22.jpg|thumb|Capture1857 ofసెప్టెంబరు [./https://en.wikipedia.org/wiki/Bahadur_Shah_Zafar20 Bahadur Shahహుమాయూన్ Zafar]సమాధి andవద్ద hisబహదూర్ sonsషా byజఫర్, [./https://en.wikipedia.org/wiki/William_Stephen_Raikes_Hodsonఅతడి Williamకుమారులను Hodson]విలియమ్ atహోడ్సన్ [./https://en.wikipedia.org/wiki/Humayun's_tombపట్టుకున్న Humayun's tomb] on 20 September 1857దృశ్యం]]
బ్రిటిషు సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసాయి. అనేకమంది పౌరులను చంపారు. ప్రధాన మసీదును, ఇతర ప్రాంతాలనూ శతఘ్నులతో పేల్చివేసారు. కులీన ముస్లిముల ఇళ్ళను ధ్వంసం చేసారు.
 
బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.<ref>{{Harvnb|Dalrymple|2006|p=400}}</ref>
 
<br />
 
=== కాన్పూరు ===
[[File:TantiaTope1858.jpg|link=https://en.wikipedia.org/wiki/File:TantiaTope1858.jpg|thumb|Tatya Tope's Soldiery]]
[[File:Cawnpore_Memorial,_1860.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Cawnpore_Memorial,_1860.jpg|thumb|A memorial erected (circa 1860) by the British after the Mutiny at the Bibighar Well. After India's Independence the statue was moved to the [./https://en.wikipedia.org/wiki/Kanpur_Memorial_Church All Souls Memorial Church], Cawnpore. Albumen silver print by [./https://en.wikipedia.org/wiki/Samuel_Bourne Samuel Bourne], 1860]]
జూన్‌లో జనరల్ వీలర్ కింద ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానాసాహెబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలో, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలో కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
 
జూన్ 25 న యూరపియన్లను అలహాబాదు వెళ్ళనిస్తానని నానా సాహెబ్ ప్రతిపాదించాడు. బ్రిటిషు వాళ్ళు అందుకు అంగీకరించారు. నానా 26 రాత్రి వెళ్ళమని చెప్పగాఅ వాళ్ళు 27 పగలు వెళ్తామని, తమవెంట పిస్తోళ్ళు ఉంచుకుంటామనీ షరతు విధించారు. 27 ఉదయాన్నే యూరపియన్లు తమ నివాసాలు వదలి గంగానదిలో నానా సాహెబ్ సిద్ధం చేసి ఉంచిన పడవల వద్దకు బయలుదేరారు.<ref>''The story of Cawnpore: The Indian Mutiny 1857'', Capt. [[Mowbray Thomson]], Brighton, Tom Donovan, 1859, pp. 148–159.</ref> కంపెనీకి విధేయులుగా ఉన్న అనేక మంది సిపాయిలను - వారి విధేయత కారణంగా గాని, వాళ్ళు "క్రైస్తవులుగా మారిపోయారని" గానీ - తిరుగుబాటుదార్లు చంపేసారు. కొద్దిగా వెనకగా నడుస్తున్న కొందరు గాయపడ్డ బ్రిటిషు అధికారులను కూడా చంపేసారు. దాదాపు యూరపియన్లంతా రేవు వద్దకు చేరుకునేటప్పటికి నదికి రెండు ఒడ్డుల పైనా సిపాయిలు మోహరించి ఉన్నారు.<ref>Essential Histories, the Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 49.</ref> కాల్పులు మొదలయ్యాయి. నావికులు పడవలను వదిలిపెట్టి పారిపోయారు.<ref name="autogenerated2">S&T magazine No. 121 (September 1998), p. 56.</ref> కొన్ని పడవలను బొగ్గులతో తగలబెట్టారు.<ref name="hibbert191">{{Harvnb|Hibbert|1980|p=191}}</ref> యూరపియన్లు పడవలెక్కి నదిలోకి వెళ్ళాలని ప్రయత్నించారు గానీ మూడు పడవలు మాత్రమే వెళ్ళగలిగాయి. డజను మంది గాయపడీన మగవారితో ఉన్న ఒక పడవ కొంత దూరం పోగలిగినప్పటికీ తిరుగుబాటుదార్లు దాన్ని పట్టుకుని తిరిగి వెనక్కు తెచ్చారు. చివరిలో తిరుగుబాటుదార్లు నీళ్ళ లోకి దూకి చావకుండా నదిలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళను కూడా చంపేసారు.<ref name="hibbert191" /> కాల్పులు ఆగాక, బ్రతికి ఉన్న వాళ్ళను చుట్టుముట్టి, వారిలో మగవాళ్ళను చంపేసారు.<ref name="hibbert191" /> ఈ నరమేధం ముగిసేటప్పటికి, దాదాపుగా మగవాళ్ళందరూ చనిపోయారు. మిగిలిన స్త్రీలు, పిల్లలను బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్లను కూడా బీబీఘర్ నరమేధంలో చంపేసారు.<ref name="autogenerated4">''A History of the Indian Mutiny'' by G. W. Forrest, London, William Blackwood, 1904.</ref> నలుగు మగవాళ్ళు మాత్రమే - ఇద్దరు ప్రైవేట్ సైనికులు, ఒక లెఫ్టెనంటు, కెప్టెన్ మౌబ్రే థామ్సన్ - తప్పించుకోగలిగారు. మౌబ్రే థామ్సన్ ది స్టోరీ ఆఫ్ కాన్‌పోర్ (లండన్, 1859) అనే పుస్తకంలో ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాలను రాసాడు.
 
తరువాత జరిగిన విచారణలో, యూరపియన్లను చంపాలనే పథకమేమీ లేదని చెబుతూ తాంతియా తోపే ఇలా చెప్పాడు: యూరపియన్లు పడవల్లో ఎక్కేసారు. పడవలను పోనిమ్మని సూచిస్తూ తాంతియా తోపే కుడి చెయ్యెత్తాడు. సరిగ్గా అప్పుడు అక్కడున్న గుంపు లోంచి ఎవరో ఈల వేసాడు. దాంతో అలజడి రేగింది. పడవ సరంగులు దూకేసారు. తిరుగుబాటుదార్లు విచ్చలవిడిగా కాల్పులు మొదలుపెట్టారు. దగ్గర్లోనే ఉన్న సవాదా కోఠిలో ఉన్న నానా సాహెబ్‌కు ఈ సంగతి తెలిసి కాల్పులను ఆపేందుకు వెంటనే వచ్చాడు.<ref>''Kaye's and Malleson's History of the Indian Mutiny''. Longman's, London, 1896. ''Footnote, p. 257''.</ref> బ్రిటిషు చరిత్రకారులు కొందరు కూడా అది ఒక అనుకోని హఠాత్ సంఘటనగా భావించారు; ఎవరో కాల్పు మొదలుపెట్టారు, ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు, ఇక ఆ తరువాత నరమేధాన్ని ఎవరూ ఆపలేక పోయారు.<ref>Edwardes, ''Battles of the Indian Mutiny'', p. 56.</ref>
 
బందీలను ముందు సవాదా కోఠికి తీసుకువెళ్ళారు. ఆ తరువాత స్థానిక మేజిస్ట్రేటు గుమాస్తా వద్దకు (బీబీఘర్) తీసుకువెళ్ళారు.<ref>{{Harvnb|David|2003|p=250}}</ref> అక్కడ ఫతేగఢ్ నుంచి వచ్చిన కాందిశీకులు కూడా ఉన్నారు. మొత్తం ఐదుగురు మగవారు, 206 గురు స్త్రీలు, పిల్లలూ బీబీఘర్‌లో రెండు వారాల పాటు బందీలుగా ఉన్నారు. ఒక వారంలో 25 మంది విరేచనాలు, కలరా కారణంగా చనిపోగా శవాలను బయటికి తెచ్చారు.<ref name="autogenerated2" /> ఇదిలా ఉండగా, అలహాబాదు నుండి కంపెనీ దళాలు బయల్దేరాయి. నానాసాహెబ్ కాన్పూరును కాపాడుకోలేడని జూలై 15 నాటికి స్పష్టమైంది. బందీలను చంపెయ్యాలని నానా సాహెబ్, ఇతర నయాకులూ నిర్ణయించారు. సిపాయీలు ఈ పని చేసేందుకు నిరాకరించగా, ఇద్దరు ముస్లిము కసాయిలు, ఇద్దరు హిందూ రైతులు, నానా అంగరక్షకుడొకరూ కలిసి బీబీఘర్ లోకి వెళ్ళారు. కత్తులు, గొడ్డళ్ళతో వాళ్ళు యూరపియన్లను చంపేసారు.<ref>{{Harvnb|Harris|2001|p=92}}</ref> ఆ హత్యాకాండ తరువాత అక్కడి గోడలు రక్తంతో తడిసిన చేతుల మరకలతో నిండిపోయాయి. నేలపై మనుషుల మాంసఖండాలు చెల్లచెదురుగా పడ్డాయి.<ref>{{Harvnb|Harris|2001|p=95}}</ref> చనిపోయిన వాళ్లను, చనిపోతున్న వాళ్లనూ దగ్గర్లోని బావిలో పడవేసారు. 15 మీటర్ల లోతున్న బావి పైనుండి 1.8 మీటర్ల వరకూ నిండిపోయింది <ref>Essential Histories, the Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 53.</ref> మిగిలిన శవాలను గంగానదిలోకి విసిరేసారు.<ref>S&T magazine No. 121 (September 1998), p. 58.</ref>
 
ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలను చెప్పారు. బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూరు వస్తున్న బ్రిటిషు సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు. బ్రిటిషు వాళ్ళు కాన్పూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాక, వాళ్లకు సమాచారమేమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు. నానా సాహెబ్‌కు బ్రిటిషు వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు.<ref name="autogenerated3">John Harris, The Indian mutiny, Wordsworth military library 2001, p. 92.</ref> గంగా నది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తు పడతారేమోననే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు.<ref name="autogenerated4" /><gallery mode="packed">
File:1857_hospital_wheeler_cawnpore2.jpg|Photograph entitled, "The Hospital in General Wheeler's entrenchment, Cawnpore". (1858) The hospital was the site of the first major loss of European lives in Cawnpore
File:Slaughter Ghat, Cawnpore.jpg|1858 picture of Sati Chaura Ghat on the banks of the Ganges River, where on 27 June 1857 many British men lost their lives and the surviving women and children were taken prisoner by the rebels.
File:1858 Kanpur well monument.jpg|Bibigarh house where European women and children were killed and the well where their bodies were found, 1858.
File:Outside of well, Cawnpore.jpg|The Bibighar Well site where a memorial had been built. [[Samuel Bourne]], 1860.
</gallery>
[[File:Kanpur_massacre.594px.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Kanpur_massacre.594px.jpg|thumb|A contemporary image of the massacre at the Satichaura Ghat]]
ఈ మారణకాండ సిపాయిల పట్ల బ్రిటిషు వారి వ్యతిరేక ధోరణి మరింత బలపడింది. ఈ సంఘటన గురించి విన్న బ్రిటిషు ప్రజలు హతాశులయ్యారు. సాంరాజ్య వ్యతిరేక, భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూరిగా కోల్పోయాయి. మిగిలిన తిరుగుటు కాలమంతా బ్రిటిషు వారికి కాన్పూరు రణనినాదమైంది. తిరుగుబాటు అంతాన నానా సాహెబ్ అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో తెలియదు.
 
కొన్ని బ్రిటిషు కథనాల ప్రకారం <ref>J. W. Sherer, ''Daily Life during the Indian Mutiny'', 1858, p. 56.</ref><ref name="AWard">Andrew Ward, ''Our bones are scattered – The Cawnpore massacres and the Indian Mutiny of 1857'', John Murray, 1996.</ref><ref>Ramson, Martin & Ramson, Edward, ''The Indian Empire, 1858''.</ref> బీబీఘర్ మారణకాండకు రెండు వారాల ముందు, అలహాబాదు నుండి వస్తున్న బ్రిటిషు సైన్యం విచక్షణ లేకుండా ప్రజలపై దమనకాండ జరిపింది. ఫతేపూర్‌లో ఒక గుంపు స్థానిక యూరపియన్లపై దాడిచేసి చంపివేసారు. ఆ నెపంతో, బ్రిటిషు కమాండరు నీల్, గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలన్నిటినీ తగలబెట్టి, అక్కడి ప్రజలను ఉరితీయాలని ఆదేశించాడు. నీల్ పద్ధతులు "క్రూరం, దారుణం"<ref>Michael Edwardes, ''Battles of the Indian Mutiny'', Pan, 1963 {{ISBN|0-330-02524-4}}</ref> ఇవి ప్రజలను భయపెట్టకపోగా, అంతకు ముందు తిరుగుబాటులో పాల్గొనని సిపాయీలను కూడా అందుకు పురికొల్పాయి.
 
నీల్ సెప్టెంబరు 26 న లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆనాటి కొందరు బ్రిటిషర్లు నీల్‌ను గొప్పగా కీర్తించారు.<ref>Units of the Army of the Madras Presidency wore blue rather than black shakoes or forage caps.</ref> బ్రిటిషర్లు కాన్పూరును స్వాధీనం చేసుకున్నాక, వళ్ళు తమ సిపాయి బందీలను బీబీఘర్‌కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన, నేలపైనా ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు.<ref>{{Citation|title=The Victorians at War, 1815–1914: An Encyclopaedia of British Military|first=Harold E.|last=Raugh|year=2004|publisher=[[ABC-CLIO]]|location=[[Santa Barbara, California|Santa Barbara]]|isbn=978-1-57607-925-6|oclc=54778450|page=89}}</ref> కొంత మందిని ఉరితీసారు. మరి కొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేసారు. ఆ సిపాయీలు మారణకాండలో పాల్గొనలేదుగదా అని కొందరు అన్నప్పటికీ, దాన్ని వీళ్ళు ఆపలేదని కొందరు అన్నారు. కెప్టెన్ థాంప్సన్ ఈ సంగతిని ధ్రువీకరించాడు.
 
==తిరుగుబాటు నాయకులు==