నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
→‎పేరువెనుక చరిత్ర: అబద్ధపు చరిత్ర కథను తీసేసాను
పంక్తి 12:
[[బొమ్మ:NK museum.jpg|thumb|right|250px|మ్యూజియం ప్రధాన స్థావరం.]]
సుప్రసిద్ధ [[బౌద్ధ మతము|బౌద్ధ]] దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ ప్రదర్శనశాల]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda Museum) లో భద్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
== పేరువెనుక చరిత్ర ==
ఖాండవదహన సమయంలో [[అర్జునుడు]] శరపరంపరగా కురిపించిన బాణాగ్ని ధాటికి కోటానుకోట్ల [[నాగులు]] శలభాల్లా మాడిమసై పోయాయట! దీంతో మొత్తం నాగజాతే అంతమై పోతుందేమోనన్న భయం నాగరాజుకు పట్టుకుందట. వెంటనే నాగరాజు [[వాసుకి]]తో కలసి అర్జునుడిని శరణు వేడిందట. కరుణించిన అర్జునుడు దూరంగా ఉన్న కొండప్రాంతంలో నివసించ మని ఆదేశించాడట. అర్జునుడి రక్షణ పొందిన నాగులున్న కొండ కాబట్టి దీన్ని [[నాగార్జునకొండ]] అనిపిలుస్తున్నారు.
 
==భౌగోళికం==
నాగార్జునకొండ [[కృష్ణా నది]]కి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉంది. ఇది [[గుంటూరు]] నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, [[హైదరాబాదు]] నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉంది. దగ్గరలోని [[రైలు]] కేంద్రము [[మాచర్ల]] సుమారు 22 కి.మీ.దూరంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు