విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
=== ముస్లిం వస్త్రధారణ నేపథ్యం ===
ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది. శరీరాన్ని అనాచ్ఛాదితంగా ఉంచడం సిగ్గుచేటనీ, సౌష్టవం కూడా తెలియని విధమైన బట్టలతో కప్పుకోవడం మర్యాదకరమనీ ముస్లిం సంప్రదాయం.
=== విజయనగర వస్త్రధారణ సాంస్కృతిక ప్రభావం ===
13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి.
=== దౌత్య, రాజకీయ కారణాలు ===
పర్షియన్, టర్కీ తదితర ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి.
 
==మూలాలు==