"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి.
=== దౌత్య, రాజకీయ కారణాలు ===
దక్కన్‌లో తమకు చిరకాల ప్రత్యర్థులైన బహమనీ సుల్తానులు, వారి నుంచి చీలిపోయిన నాలుగు షాహీ వంశాలతో పోటీకి, పోరాటాలకు తట్టుకోవడానికి విజయనగర చక్రవర్తులు పర్షియా, టర్కీ, పోర్చుగీసు దేశస్థులతో దౌత్యానికి, వ్యాపారానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ క్రమంలో ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి. దౌత్యవేత్తలకు, మంత్రులకు, కవులకు విజయనగర చక్రవర్తులు మేలిమి రకం కుల్లాయి, అంగీ బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ప్రారంభించారు. ఇస్లాం సంస్కృతికి చెందిన దౌత్యవేత్తలు ఇతర హిందూ రాజుల వస్త్రధారణ అనాగరికంగా కనిపించేది. తమ తమ పుస్తకాల్లో "రాజుకీ బిచ్చగాడికీ తేడాలేద"నీ, "మనుషులూ, రాక్షసులూ కానివారిలా, పీడకలలు తెచ్చేట్లున్నార"నీ తీవ్రమైన వ్యాఖ్యలు నమోదుచేశారు. తిమూరిద్ సామ్రాజ్యపు దౌత్యవేత్త సమర్‌ఖండి విజయనగర చక్రవర్తిని మాత్రం "నగ్నంగా హిందువులా కాకుండా, మేలిమీ జేతూనీ పట్టుతో నేసిన అంగీ ధరించి శరీరాన్ని పద్ధతిగా కప్పుకుని వున్నాడని" వర్ణించి తన రాజుతో పోల్చదగ్గవాడనీ, ఉత్తముడనీ, సమర్థుడనీ పొగుడుతూ రాసుకున్నాడు. యుద్ధాల్లో బహమనీలను ఎదుర్కోవడానికి వారి అశ్వశక్తిని తట్టుకునే ఉత్తమ జాతి అశ్వాలను దిగుమతి చేసుకునేందుకూ విజయనగరానికి ఈ దౌత్యం, వ్యాపారం కీలకమైనవి. ఒక దశలో విజయనగర సామ్రాజ్యం మధ్యప్రాచ్యం నుంచి ప్రతీ అశ్వాన్నీ తాను తప్ప మరే ఇతర ముస్లిం ప్రత్యర్థులు దిగుమతి చేసుకోలేని విధంగా విజయవంతమైన ఒప్పందాలు కుదుర్చుకోగలిగింది. హిందూ సంస్కృతిని విస్తృతమైన ఇస్లాం సంప్రదాయాలతో ఇలా అనుసంధానం చేసి దౌత్యపరమైన విజయాలు సాధించడంలో దుస్తులూ కీలకపాత్ర పోషించాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630864" నుండి వెలికితీశారు