"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

బొత్తాలు ఉన్న అంగీ, తలపైన కుళ్ళాయి (టోపీ లాంటిది), నడుము కింది భాగంలో పంచె అన్నవి విజయనగర సామ్రాజ్యకాలంలో పురుషులు, మరీముఖ్యంగా రాజాస్థాన పురుషుల దుస్తులు. అంగీ చేతులు కొంచెం బిగువుగా ఉండేవి. కొందరి అంగీలు పొడుగ్గా కింద మోకాళ్ళ వరకూ, మరికొందరివి నడుము వరకు మాత్రమే ఉండేది. చరిత్రకారుడు ఫిలిప్ బి. వాగనర్ దీన్ని పరిశీలిస్తూ ఆ పొడుగు, పొట్టి అంగీలు వారి వారి సామాజిక స్థాయిని సూచిస్తూ ఉండవచ్చనీ, పొట్టి అంగీలవారు సేవకులు కావచ్చనీ అభిప్రాయపడ్డాడు. అంగీ మెడ వెడల్పుగా, కప్పడానికి మడతపెట్టిన ఒక పట్టీతో ఉండేది. అంగీ ముందుభాగం తొడుక్కోవడానికి వీలుగా చీలివుండి, బొత్తాలతో ఉండేది. విజయనగర చక్రవర్తి ధరించే అంగీ పల్చగా ఉండేది. దాన్ని నూలు, పట్టు, జరీ ముడిగుడ్డలుగా వినియోగించి పనితనంతో నేసినదిగా విదేశీ యాత్రికులు గుర్తించారు. రాజు ధరించే అంగీ మేలైన రకం పట్టుతో ఉండడమే కాక జరీలో బంగారాన్ని విస్తారంగా వాడి వివిధ రూపాలను చిత్రించేవారని న్యూనిజ్ పేర్కొన్నాడు. ఇక మిగిలిన ఆస్థానీకులు, సాధారణ సేవకులు ధరించే అంగీలు వారి వారి స్థాయిలను బట్టి వివిధ నాణ్యతలు కలిగిన బట్టతో కుట్టేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}}
 
తలపై కిరీటాలు కాక అందరూ కుళ్ళాయి అని పిలిచే గుడ్డ టోపీ ధరించేవారు. వారి వారి స్థాయిని బట్టి దానికి జరీ పని ఉండేది. కింది స్థాయి ఆస్థానీకులు, సేవకులు తదితరులు ఏ జరీ లేని సామాన్యమైన కుళ్ళాయి ధరించేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}} కృష్ణదేవయరాయల కుళ్ళాయి రెండు అడుగుల పొడవు ఉండేదనీ, రాణివాసాల్లో మసిలే మహిళలు ముత్యాలతో చేసిన దండలు అలంకరించిన కుళ్ళాయిలు ధరించేవారనీ విదేశీయాత్రికులు పేర్కొన్నారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=3}} పన్నుల సేకరణ, లెక్కలు రాసే కరణాలు బోడ కుల్లాలు (చిన్న కుల్లాయిలు), చింపి కుప్పసములు (కుప్పసములంటే అంగీలు) ధరించేవారని పరమయోగి విలాసమనే ద్విపద కావ్యంలో రాసివుంది.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ" />
 
[[File:K238283.png|thumb|తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆచ్ఛాదన లేని పైభాగంతో కృష్ణదేవరాయల విగ్రహం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630879" నుండి వెలికితీశారు