నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
[[File:Nellore.Rly station.escaleter.JPG|thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనులోని ఎస్కెలెటరు]]
 
'''[[నెల్లూరు]]''' (Nellore), [[భారత దేశము|భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] యొక్క ముఖ్య [[పట్టణం|పట్టణము]], మండలము, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]]కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన [[శ్రీ తల్పగిరి రంగనాధ స్వామివారి ఆలయం|శ్రీ తల్పగిరి రంగనాధస్వామి]] వారి ఆలయం ఉంది. ఇది [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి [[శ్రీరంగం]], [[శ్రీరంగపట్టణం]]). అంతేకాక ప్రాచీనమైన [[శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు|శ్రీ మూలస్థానేశ్వర స్వామి]] వారి [[దేవాలయం]] కూడా ఉంది. రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.
 
== పేరు వెనుక చరిత్ర ==
నెల్లూరుకు [[విక్రమసింహపురి]] అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు [[సింహపురి]] రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ([[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) అల్లా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది.
 
ఇంకో కథ కూడా ప్రాచుర్యం లో ఉంది. నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం కలదు.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కధద్వారా తెలియుచున్నదిస్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్టింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అందురు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.
పంక్తి 238:
[[వర్గం:నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు