కమ్యూనిజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
:''ఈ వ్యాసము కమ్యూనిజం అనే రాజకీయ మరియు సామాజిక సిద్ధాంతము గురించి మాత్రమే. కమ్యూనిస్ట్ సంస్థలు/కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాదు''.
'''[[కమ్యూనిజం]]'''(Communism) అనునది ఒక రాజకీయ, సాంఘిక మరియు ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం 'అందరికీ చెందిన' అనే అర్థం వచ్చే ''కమ్యూనిస్'' అనే [[లాటిన్]] పదం నుండి వచ్చింది. ఉమ్మడి యాజమాన్యపు ఆస్తి అనే భావన గ్రీకుల కాలం నుండి ఉంది. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక మరియు సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. ఉత్పత్తికేంద్రాల మరియు వనరుల ఉమ్మడి యాజమాన్యం అనేది కమ్యూనిజం మూలసూత్రం. కమ్యూనిజం అనునది [[సోషలిజం]] యొక్క అత్యుత్తమ దశ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక జీవన విధానమని చెప్పవచ్చును. మానవ [[చరిత్ర]]<nowiki/>లో జీవన విధానాన్ని పూర్తిగా మార్చాలని ప్రతిపాదించిన మొట్టమొదటి సిద్ధాంతమని చెప్పవచ్చు. ఇటువంటి ప్రతిపాదన 19వ శతాబ్దంలో చేయబడినా, ఆచరణలోకి 20వ శతాబ్దపు మొదటి రోజులలో వచ్చింది. కమ్యూనిజం అనేది మొదట యూరప్ ఖండమునందు అవిర్భవించింది. మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నిక అయిన సభ్యులు ప్రాన్స్ దేశానికి చెందినవారు. అలా ఎన్నికయిన కమ్యూనిస్ట్ ప్రతినిధులు, [[శాసనసభ|శాసన సభ]]<nowiki/>లో స్పీకరుకు [[ఎడమ]] వైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది. ఇప్పటికీ కమ్యూనిస్టులను "లెఫ్టిస్ట్" లనే వ్యవహరిస్తున్నారు.ఇక తెలంగాణ లో 1940 నుండి 1952 వరకు తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం చెయ్యడం ద్వారా కమ్యూనిజం తెలంగాణ లో భారతదేశం లో బాగా బలపడింది.
 
<!-- [[బొమ్మ:Kerala communist tableaux.jpg|right|thumb|125px|కేరళలో ఒక కమ్యూనిస్టు ప్రదర్శనలోని దృశ్యం]]
[[బొమ్మ:CPIM Conference Poster.JPG|right|thumb|350px|హైదరాబాదులో ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభలకు సంబంధించిన ప్రచార చిత్రం]]
(వ్యాసంతో సూటిగా సంబంధం లేవనిపించిన బొమ్మల తొలగింపు) -->
 
== కమ్యూనిజం అంటే ఏమిటి ==
సామాజికముగా, మానవుడి జీవన విధానాలు అనేక రకాలు. అవి అన్నీ కూడా మానవుడి సంఘ జీవన విధానానం మీద ఆధారపడి ఉంటాయి. మానవుడు సంఘ జీవిగా పరిణామ క్రమానికి మూలం శ్రమ విభజన. అందరూ అన్ని పనులు చెయ్యలేరు, తమకు కావలిసిన వస్తువులు వసతులు తమకు తామే సమకూర్చుకోలేరు. అందువలన, సమాజం క్రమంగా శ్రమ విభజన అంతర్లీనంగా పరిణామం చెందినది. ఈ పరిణామ క్రమంలో అనేక అసమానతలు ఏర్పడతాయి. ఇటువంటి అసమానతలను పొగొట్టే అవకాశాలను పొందుపరిచి తద్వారా మానవుడి సంఘ జీవన విధానాన్ని సంస్కరించే ప్రయత్నమే కమ్యూనిజం అని చెప్పుకోవచ్చు. అటువంటి 'సంస్కరణకు ' సామాజిక జీవన విధానం, పరిపాలనా విధానం మరియు ఆర్థిక విధనాలలో మౌలిక మార్పులు తప్పనిసరిగా తీసుకుని రావాలని, తద్వారా సమాజంలోని అనేక అసమానతలను ఎలా తొలగించవచ్చునో చేయబడిన ప్రతిపాదనల రూపమే కమ్యూనిజం. ఈ ప్రయత్నంలో కావలిసిన మార్పులు 'ప్రజా విప్లవం' ద్వారానే సాధ్యం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడతారు. ఏతా వాతా, కమ్యూనిజం సామాజిక/ఆర్థిక అసమానతలను పోగొట్టటానికి మార్గాలను సూచించిన ఒక సిద్ధాంతము.
"https://te.wikipedia.org/wiki/కమ్యూనిజం" నుండి వెలికితీశారు