"వికీపీడియా:ప్రయోగశాల" కూర్పుల మధ్య తేడాలు

[[ఆలూరి భుజంగరావు]]
నేను గురజాడ రాసిన దేశ భక్తి గేయాన్ని రాస్తున్నాను.దీనిని ఎక్కదడ భద్రపరచ వలెనో నాకు తెలియదు.దయచేసి ఎవరైనా సహకరిన్చగలరు.
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
 
 
 
దెశభక్తిగేయం - గురజాడ
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్!
గట్టి మేల్ తలపెట్టవోయ్!
 
పాడి పంటలు పొంగిపొర్లే
దారిలో నువుపాటుపడవోయ్;
తిండి కలిగితె కండ కలదోయ్,
కండ గలవాడేను మనిషోయ్!
 
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశిసరుకులు నించవోయ్
 
అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశిసరుకుల నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపదలబ్బవోయ్
 
వెనకచూచిన కార్య మేమోయ్?
మంచి గతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయవోయ్
వెనక పడితే వెనకే నోయ్
 
పూను స్పర్ధను విద్య లందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
 
దేశాభిమానం నాకు కద్దని
వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
 
ఓర్వలేమిపిశాచి,దేశం
మూలుగులు పీల్చేసెనోయ్!
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్!
 
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్?
ఒకరిమేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్!
 
స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్!
 
చెట్ట పట్టాల్ కట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగ వలెనోయ్
 
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచిపెరిగి
లోకమున రాణించునోయ్!
 
దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్
నరుల చెమటను తదిసి మూలం
ధన పంటలు పండవలెనోయ్!
 
ఆకులందున అణిగి మణిగీ
కవిత కోవిల పలక వలెనోయ్,
పలుకులను విని, దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోయ్!
 
़[[సభ్యులు:Vijay rajasekharuni|Vijay rajasekharuni]]విజయ్ రాజశేఖరుని
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/269521" నుండి వెలికితీశారు