అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[లత]]|
}}
కొత్త మిలీనియంలో ఈ చితాన్ని తెలుగు పిల్లలు చూస్తే తెలుగు టైటానిక్ అంటారు.సినీమాలో 80శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది.బాపు రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం.మిని గ్లోబు ను ,రాజహంస,జనతా లలో మనంచూడవచ్చు.అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు పైతరగతి కూడా)మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి.రాముడు(మంచిబాలుడు),(ప్రేమా(అమా)యకురాలు) సీత,తీతా,అప్పుల అప్పారావు,పెసర్ట్ల సావాలమ్మ,దొంగ భక్తులు,దొంగ అభక్తులు(అథీయిస్టులు),అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాటి లా పేని ఆ తాటి తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు.మహదేవన్ సంగీతంలో రామకృష్ణ,సుశీల పాడిన పాటలన్నీ హిట్టే."అబ్బోసి బుల్లెమ్మ,ఎదగడానికెందుకురా తొందరా,మముబ్రొవమని చెప్పవె,కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా,హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలెదు.( బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవ గా చిత్రించారు)తరవాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్ గా ఎదిగింది.ఇటివల వచ్చిన గోదావరి చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనె ఉంటాయి.