చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==రాజకీయ జీవితం==
విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తితో వంశీ చంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. వంశీచంద్ రెడ్డి 2005 – 2006 లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వహించాడు. 2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2018 ఆగష్టులో కాంగ్రెస్ఆయన పార్టీసేవలకు ఆయననుగుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు.