నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శృంగేరి శంకరమఠం: వ్యాసం విస్తరణ
పంక్తి 103:
=== కపోతేశ్వరస్వామి ఆలయం ===
ఈ ఆలయం సమీప నకిరకల్లు మండలానికి చెందిన చేజర్ల గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు.మేఘదాంబరుడు శిబిచక్రవర్తి అనుమతితో అతని పరివారంతో తీర్ధయాత్రలకు బయలుదేరతాడు. ఒక కొండపై అతడు  కొందరు యోగులతో కలసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థీవ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి అతనూ మరణించాడు. తమ్ముళ్ళును వెతుక్కుంటూ శిబి చక్రవర్తి అక్కడికి వచ్చి రెండు లింగాలను చూసి, తన్మయం చెంది అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షీస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగానూ ఆ ప్రాంతానికి వస్తారు.వేటగానితో తరమబడిన [[కపోతము|పావురం]] శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా [[శిబి చక్రవర్తి]] అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిభిచక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, [[త్రాసు|త్రాసులో]] పావురాన్ని ఒక వైపు ఉంచి, తన [[శరీరం|శరీరంలో]] కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి చక్రవర్తి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.దీని మీద ఇతరత్రా కథనాలు కూడా ఉన్నాయి
 
== పీఠాధిపతుల నిలయం నరసరావుపేట ==
 
=== భారతీ తీర్థ మహాస్వామి ===
 
=== చిదానంద భారతీ స్వామి ===
 
==పట్టణానికి చెందిన పేరొందిన వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు