ప్రధాన మెనూను తెరువు

నరసరావుపేట

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం లోని పట్టణం


నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.దీనిని పల్నాడు ప్రాంతనికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.

నరసరావుపేట
నరసరావుపేట is located in Andhra Pradesh
నరసరావుపేట
నరసరావుపేట
అక్షాంశ రేఖాంశాలు: 16°14′10″N 80°03′14″E / 16.236°N 80.054°E / 16.236; 80.054Coordinates: 16°14′10″N 80°03′14″E / 16.236°N 80.054°E / 16.236; 80.054 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండలంనరసరావుపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.65 కి.మీ2 (2.95 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,16,250
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08647 Edit this at Wikidata)
పిన్(PIN)522601 Edit this at Wikidata
జాలస్థలిhttp://narasaraopet.cdma.ap.gov.in/en Edit this at Wikidata

విషయ సూచిక

పట్టణ జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.[1]

భౌగోళికంసవరించు

నరసరావుపేట

నరసరావుపేట 7.65 చ.కిమీలో విస్తరించి వుంది.[2]

సమీప మండలాలుసవరించు

సమీప పట్టణాలుసవరించు

పట్టణ పరిపాలనసవరించు

నరసరావుపేట పురపాలకసంఘం 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.

పట్టణం గత నిర్మాణ చరిత్రసవరించు

నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "అట్లూరు" అనే చిన్న గ్రామం ఉండేది.దీనికి కటికనేని నారయ్య,కటికినేని రామయ్య ఈ గ్రామానికి ముఖాసాదార్లు (జాగీరుదారులు)గా ఉండేవారు.నాటి అట్లూరు గ్రామం ఇప్పటి నరసరావుపేటకు పశ్చిమ భాగాన ఉండేది.అదే ఇప్పడు 'పాతూరు'గా పిలువబడుతుంది.ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం సా.శ.పూ.1797 పింగళి నామ సంపత్సరం, శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారంనాడు అతని తండ్రి నరసరావుపేరుతో కోట,పేటల కట్టుబడికి నిర్మాణం చేపట్టి, కోటకు నరసరావుపేట రాజావారి కోట అని, పేటకు నరసరావుపేట అని నామకరణం చేసాడు.అదే నరసరావుపేటగా అవతరించింది.నాటి రాజావారి కోట ఆ తరువాత రాజావారి కోటగా వాడుకలోకి వచ్చింది కోట,పేటల నిర్మాణానికి అట్లూరు ముఖాసాదార్లయిన నారయ్య,రామయ్యలకు అట్లూరుకు బదులుగా పెట్లూరివారిపాలెంను జాగీరుగా ఇచ్చి అట్లూరును గుండారాయణిం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలు పట్టణంగా ఎదిగి, 1915లో నరసరావుపేట పురపాలక సంఘంగా ఆవిర్భావానికి దారితీసింది.నరసరావుపేట పురపాలక సంఘం, శత సంవత్సర వేడుకలను 2015, డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.[3][4]

రవాణా సౌకర్యాలుసవరించు

 
నరసరావుపేట రైల్వే స్టేషన్

ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08 km (97.60 mi). నరసరావుపేట బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద బస్సులు నడుపుతుంది.ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పట్టణాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా సదుపాయం ఉంది.ఇక్కడకు సమీప విమానాశ్రయం విజయవాడ. నరసరావుపేట రైల్వే స్టేషన్ నల్లపాడు - నంద్యాల విభాగంలో ఉంది. నరసరావుపేట రైల్వే స్టేషనును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది.దీనిని గుంటూరు రైల్వే డివిజనుచే నిర్వహించబడుతుంది.

విద్యా సౌకర్యాలుసవరించు

నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల (ఎన్‌ఇసి)సవరించు

 
నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్

ఈ కళాశాల గాయత్రీ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (జిఇడిఎస్) వ్యవస్థాపకుడు మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావుచే 1998 లో స్థాపించబడింది. కాకినాడలోని జెఎన్‌టియుకు శాశ్వత అనుబంధంతో, గాయత్రి ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (స్వయం ప్రతిపత్తి సంస్థ) ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుపబడుతుంది.ఈ సంస్థను న్యూ డిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందబడి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుండి ‘ఎ’ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.ఇది గుంటూరు జిల్లాల పల్నాడు ప్రాంతంలో ఏర్పడిన మొదటి సాంకేతిక విద్యా సంస్థ.ఈ కళాశాల ఐయస్ఒ 9001: 2008 తో ధృవీకరించబడింది. గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతంలోని ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు, నాయకులును ఈ కళాశాల ఉత్పత్తి చేసింది.ఈ కళాశాల ఆవిష్కరణ, పరిశోధన, వ్యవస్థాపకతకు కేంద్రంగా పనిచేస్తుంది.దీనిని విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల బృందం నిర్వహిస్తుంది.కళాశాల మేనేజింగ్ కమిటీ ఛైర్మన్‌గా మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌గా మిట్టపల్లి చక్రవర్తి వ్యవహరిస్తున్నారు.

శ్రీ సుబ్బారాయ & నారాయణ కళాశాలసవరించు

శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల,1950లో అప్పటి వెనుకబడిన పలనాడు, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా ప్రారంభించింది.ఆ తరువాత పూర్తి స్థాయి డిగ్రీ కళాశాలగా ------- నుండి మారింది.కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది. మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది. ఇది వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించింది.కళాశాల కమిటీ ప్రెసిడెంటుగా కపిలవాయి విజయ కుమార్, సెక్రటరీ, కరస్పాండెంట్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపాల్ గా -------- నుండి వ్యవహరిస్తున్నాడు.ఈ కళాశాలలో వివిధ రంగాలలో పేరొందిన కె.సి రెడ్డి, (చైర్మన్ A.P.S.C.H.E), శేషా శయనా రెడ్డి (హైకోర్టు న్యాయమూర్తి), వి. బాలమోహన్ దాస్ (వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), కాసు వెంకట కృష్ణారెడ్డి (నరసరావుపేట శాసనసభ మాజీ యం.యల్.ఎ), డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం (దూరదృష్టి, ప్రఖ్యాత విద్యావేత్త, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు,ఎ.యన్.యు) వ్యక్తులు ఈ సంస్థ యొక్క పూర్వ విద్యార్థులు.కళాశాలలో ప్రస్తుతం 'అబోడ్ ఆఫ్ లెర్నింగ్' పి.జి.విద్యా కోర్సులు, యం.బి.ఎ., యం.సి.ఎ.,యం.యస్సీ కెమిస్ట్రీ, సైన్స్ రంగాలలో భోధనలు జరుగుతాయి.ఇటీవలి పరిణామాలు,మార్పుల గురించి తెలుసుకుని కొత్తగా ........ నుండి బయో - టెక్నాలజీని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రవేశపెట్టబడింది.యన్.సి.సి పూర్వ విద్యార్థుల విభాగం ఉన్నత స్థానాల్లో ఉంది.1955 లో స్థాపించబడిన యన్.యస్.యస్.కళాశాల విభాగం ఆరోగ్యం పరిశుభ్రత, అక్షరాస్యత, మత శ్రేయస్సు, సామరస్యంపై అవగాహన కల్పించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది.శారీరక విద్య మాజీ, ప్రస్తుత డైరెక్టర్ల మార్గదర్శకత్వంలో కళాశాల రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను పొందింది. కళాశాల లైబ్రరీలో 40,000 పుస్తకాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు 600 మంది విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్న హాస్టల్‌ భవనాలు ఉన్నాయి.విద్య అంటే సమాధానాలు ఇవ్వడం కాదు. తనకు తనలో తాను సమాధానాలు కనుగొనే మార్గంతో విద్యార్థిని సన్నద్ధం చేయడం కోసం, విద్య తమను తాము కనుగొనటానికి కళాశాల విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. వారు ఉన్నత వ్యక్తులుగా ప్రతి విద్యార్థిలో ఉన్న ఆసక్తిని గమనించి డాక్టర్, ఇంజనీర్, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, క్రీడా వ్యక్తి, పర్యావరణవేత్త, కవి, రచయిత లేదా ఆర్థికవేత్త గా ఎదగటానికి కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు వారి కలలకు అనుగుణంగా వనరులను ప్రసారం చేయడంలో వారికి మద్దతు ఇస్తారు.డి.పు.యస్. సొసైటీ యొక్క నినాదం “సెల్ఫ్ బిఫోర్ సెల్ఫ్” కు అనుగుణంగా మాతృభూమికి సేవ చేయడానికి నాగరిక, ఉత్పాదక మానవ మూలధనాన్ని స్థిరంగా ఉత్పత్తి చేయటానికి నిరంతర కృషి ఉంటుంది.

శ్రీమతి కాసు రాఘవమ్మ & బ్రహ్మానందరెడ్డి కళాశాల:సవరించు

నందమూరి బసవతారకం కళాశాల:సవరించు

ఎస్. వి. పి. ఎన్. సి. & కె. ఆర్. ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా సంస్థ:సవరించు

కృష్ణవేణి డిగ్రీ కాలేజి:సవరించు

కృష్ణవేణి ఇంజినీరింగ్ కాలేజి ఫర్ విమెన్:సవరించు

మేదరమెట్ల అంజమ్మ & మస్తానరావు బి.ఇ.డి. కాలేజి:సవరించు

త్రాగునీటి సౌకర్యంసవరించు

పట్టణానికి త్రాగు నీరు సమీపంలోని శాంతినగర్ మంచినీటి చెఱువు నుండి పంపిణి జరుగుతుంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుండి మంచినీటి చెఱువుకు సాగు నీరుతో నింపుతారు.

పట్టణానికి పేరు తెచ్చిన కట్టడాలుసవరించు

 
భువునచంద్ర టౌన్ హాల్,నరసరావుపేట
 • భువనచంద్ర టౌన్ హాలు:ప్రకాశ్‌నగర్‌ వెళ్లు రోడ్డులో రైలుగేటు దాటినతరువాత కుడివైపు ఉంది. భువనచంద్ర టౌన్ హాలు నిర్మాణం గావించిన స్థలం ఒకనాడు మూగజీవాలకు (పశువుల) ఆసుపత్రి కలిగిన ప్రదేశం.ఇది దాదాపుగా పట్టణం నడిబొడ్డున ఉంది.పశువులు మేపుకునే వారు సామాన్యంగా పట్టణానికి దూరంగా నివాసం ఉంటారు.పశువులకు వైద్యం చేయుంచుకోవటానికి అంత దూరం నుండి తోలుకొచ్చి వాటికి తగిన వైద్యం చేయించి తిరిగి తీసుకుపోవటం వ్యయ ప్రయాసలతో కూడినపని భావించి రైతులుఎక్కువమంది నివసించే పెద్ద చెరువు ప్రాంతానికి తరలించి, ఆ ప్రదేశంలో అన్ని హంగులతో ఒక సమావేశమందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా! అని వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే 'భువనచంద్ర టౌనుహాలు'. క్రమక్రమంగా నరసరావుపేట పట్టణానికే అది సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది.2004 లో అదే ప్రాంగణంలో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం అవటంతో టౌన్ హాలుకు పరిపూర్ణత చేకూరింది.
 • కన్యల ఆసుపత్రి

పట్టణానికి పేరు తెచ్చిన ప్రాంతాలుసవరించు

 • శివుడి బొమ్మ సెంటరు
 • గడియారపు స్తంభం సెంటరు
 • రాజా గారి కోట సెంటరు
 • గాంధీ పార్కు సెంటరు

పట్టణంలోని దర్శనీయ దేవాలయాలుసవరించు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

స్థానిక పాతూరులో 11వ శతాబ్దిలో ప్రతిష్ఠించిన ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు, 2014,ఫిబ్రవరి-28న శిలాన్యాసం చేసి, ప్రారంభించారు. 2015 లో పూర్తి చేయాలని నిశ్చయించారు. ఈ ఆలయ శిల్పకళలో ద్రావిడ, చోళ రీతులకు విశిష్టస్థానం ఉంది. దేశంలోని పురాతన ఆలయాలన్నీ ఆయా శైలిలోనే నిర్మించారు. పూర్తిగా రాతితో ఆలయనిర్మాణం చేస్తున్నారు. అందుకుగాను బెంగళూరులో స్తంభాలు, ఇతర శిలలను తయారుచేస్తున్నారు. తెలుపు, గ్రే వర్ణాలు మిళితంగా ఉండే గ్రానైటు రాతిని నిర్మాణంలో ఉపయోగించుచున్నారు. ఆలయం పునాదులనుండి పైకప్పు వరకు రాతితోనూ, ఆపైన విమానశిఖరం తదితర నిర్మాణాలను సిమెంటుతోనూ తయారు చేస్తారు. పైకప్పు వరకు 15 పొరలుగా నిర్మాణం చేపట్టినారు. ఆలయం ఎత్తు 42 అడుగులు, పొడవు 52 అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం పైకప్పు వేసే స్థాయికి నిర్మించారు. కిటికీలు, ఆలయ రాతిగోడలకు అమర్చిన స్తంభాలు శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతున్నవి. తమిళనాడుకి చెందిన దేవాలయ నిర్మాణ నిపుణులు 10 మంది వరకు, ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్దేశించిన నియమాలు పాటించుచూ నిర్మాణం చేస్తున్నారు.[5]

శృంగేరి శంకరమఠంసవరించు

ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో రైలుగేటుకు ముందు ఎడమవైపున శృంగేరి శంకరమఠం ఉంది.దీనిని శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి నిర్మించారు.1989 మే 21 ఆదివారం ఉదయం శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,కుంభాభిషేక మహోత్సవం భారతీతీర్ధానంద స్వామి చేతులమీదుగా జరిగింది.[6]

శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ విజయ చాముండేశ్వరీ దేవస్థానంసవరించు

శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామివారి ఆలయంసవరించు

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంసవరించు

శ్రీ ఆయ్యప్పస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం సత్తెనపల్లి వెళ్లు రహదారిలో ఉంది.ఆలయం ముఖద్వారంతో నిర్మించారు.

శ్రీ ప్రసన్నఆంజనేయస్వామివారి దేవాలయంసవరించు

ఈ ఆలయం స్థానిక బరంపేటలో1932 సంవత్సరంలో నిర్మించబడింది.

ఇస్కాన్ టెంపుల్సవరించు

 
ఇస్కాన్ ఆలయం, నరసరావుపేట

(ప్రధాన వ్యాసం:నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్) స్థానిక బరంపేటలో ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ నిర్మించిన ప్రదేశంలో 2019 నాటికి 40 సంవత్సరంల క్రిందట నుండి "రాధా కృష్ణ వాసుకి క్షేత్రం" అని పిలవబడే మందిరం ఉంది.2000 సంవత్సరంలో ఇస్కాన్ ఈ ప్రదేశంలో అందమైన ఆలయాన్ని నిర్మించే ప్రాజెక్టు ప్రారంభించి అన్ని హంగులతో 2012 మార్చి నాటికి పూర్తిచేసి, 2012 మార్చి 25న జయ పాథస్వామి గురు మహారాజ్ చే దేవతలను ఏర్పాటుచేసి ఆలయాన్ని ప్రారంభించుట జరిగింది.ఇక్కడ దేవతలు కిషోరభావాల్తో ఉన్నాయి. కాబట్టి అవి యవ్వనంగా, అందమైనవిగా కనిపిస్తాయి.యువతను ముఖ్యంగా పిల్లలను చాలా ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు రాధారాణి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆసందర్భంగా అ రోజున రాథారాణి నిజపాద దర్శనం ఉదయం 8-30 నుండి రాత్రి వరకు, అనుమతిస్తారు.

పట్టణానికి సమీపంలోని దర్శనీయ పుణ్యక్షేత్రాలుసవరించు

త్రికోటేశ్వర స్వామి దేవాలయంసవరించు

ఇక్కడకి సమీపంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి దేవాలయం12 కి మీ.ల దూరంలో ఉంది. ఆ అలయంలో శివుడు త్రికొటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది. ప్రతి శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది.యెన్నొ ప్రభలు వస్తాయి.

కపోతేశ్వరస్వామి ఆలయంసవరించు

ఇక్కడికి సమీపంలో దర్శించదగిన ఆలయాలలో చేజెర్లలోని కపోతేశ్వర ఆలయం ఒకటి.

పట్టణ ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

 1. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
 2. "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department. Government of Andhra Pradesh. Retrieved 20 June 2015.
 3. "వరల్డ్ టాప్10లో అమరావతి: బాబు, బాబూ! జాబు ఎప్పుడు.. వైసిపి ప్లకార్డులు". వన్ ఇండియా. 2015-12-11. మూలం నుండి 2018-12-09 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 4. "Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec". NTv. Cite web requires |website= (help)
 5. ఈనాడు గుంటూరు రూరల్; 2014,సెప్టెంబరు-21; 20వపేజీ
 6. నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లంకెలుసవరించు