వీటూరి: కూర్పుల మధ్య తేడాలు

- 2 వర్గాలు; + 5 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎సినీ రచయితగా: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 43:
సినిమాలపై ఆసక్తి ఉండటంతో 1958లో మద్రాసు పయనమయ్యాడు వీటూరి. సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజుగార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా స్క్రిప్టు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు రాశాడు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం కలగడంతో ‘గజదొంగ’ చిత్రానికి వీటూరి మాటలు రాశాడు.
 
వీటూరి ‘స్వర్ణగౌరి (1962)’ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశాడు. అలా ఆయనకు తొలిసారిగా పూర్తిస్థాయి అవకాశం వచ్చింది. తర్వాత వీటూరి రాసిన తొలి సాంఘిక చిత్రం ‘దేవత (1965)’. ఇందులో రాసిన పాటలు వీటూరికి మంచిపేరు తెచ్చాయి. నిర్మాత భావనారాయణ, జానపదబ్రహ్మ [[బి.విఠలాచార్య]]ల ప్రోత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచన చేశాడు. వందకు పైగా పాటలు రాశాడు.
 
వీటూరి ‘విజయలలిత పిక్చర్స్’ సంస్థను స్థాపించి ‘అదృష్టదేవత (1972)’ సినిమా నిర్మించాడు. వీటూరి రాసిన ‘భారతి’ కథను స్వీయ దర్శకత్వంలో ‘భారతి (1975)’ చిత్రంగా తెరకెక్కించాడు. దానికి మాటలు, పాటలు కూడా వీటూరివే. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967)’ చిత్రంలోని వీటూరి పాటతోనే ఎస్.పి.బాలు గాయకునిగా సినిమారంగ ప్రవేశం చేశాడు. 1984లో [[మద్రాసు]]లో కన్నుమూశాడు.
"https://te.wikipedia.org/wiki/వీటూరి" నుండి వెలికితీశారు