సురేష్ రైనా: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
పంక్తి 1:
[[1986]], [[నవంబర్ 27]]న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[ఘజియాబాదు]]లో జన్మించిన '''సురేష్ రైనా''' (Suresh Raina) [[భారత్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. [[2005]] [[జూలై]] నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. [[2006]] ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉన్ననూ ఇంకనూ టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేయలేడు. దేశవాళీ క్రికెట్ పోటీలలో [[రంజీ ట్రోఫి]]లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [[దులీప్ ట్రోఫి]] పోటీలలో [[సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు|సెంట్రల్ జోన్]] జట్టు తరఫున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమచేతితో చేసే రైనా బౌలింగ్‌లో మంచి ఆఫ్ స్పిన్నర్.
==ప్రారంభ క్రీడా జీవితం==
13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదిహేనున్నర సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపైకై [[ఇంగ్లాండు]] పర్యటించి రెండు అర్థసెంచరీలు సాధించాడు.<ref>http://www.cricinfo.com/db/ARCHIVE/2002/OTHERS+ICC/IND-U19_IN_ENG/STATS/IND-U19_IN_ENG_JUL-AUG2002_AVS_IND-U19.html</ref> ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరఫున [[శ్రీలంక]] పర్యటించాడు. [[2003]]లో 16 సంవత్సరాల వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ తరఫున తొలిసారిగా [[రంజీ ట్రోఫి]] అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్‌లో పాల్గొనడానికి [[పాకిస్తాన్]] పర్యటించాడు. [[2004]]లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థసెంచరీలు సాధించాడు. [[2005]] ప్రారంభంలో ఛాలెంజర్ సీరీస్‌కు ఎంపైకైనాడు. [[సచిన్ టెండుల్కర్]] గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సురేష్_రైనా" నుండి వెలికితీశారు