భూ సమవర్తన కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
+ఇంగ్లీషు మాట
పంక్తి 1:
[[దస్త్రం:Geosynchronous_orbit.gif|thumb|భూ సమన్వయ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహం యానిమేషన్]]
[['''భూ సమన్వయ కక్ష్య]] (,'''GSO''') భూమి చుట్టూ ఉన్న ఒక కక్ష్య. ఇంగ్లీషులో దీన్ని ''జియో సింక్రొనస్ ఆర్బిట్'' అంటారు. ఈ కక్ష్యలో తిరుగుతున్న్నతిరుగుతున్న వస్తువు పరిభ్రమణ కాలం, [[భూభ్రమణం|భూభ్రమణ]] కాలంతో సమానంగా, అంటే దాదాపు 23 గంటల 56 నిముషాల 4 సెకండ్లు ఉంటుంది.<ref>V. Chobotov, ed., (1996) ''Orbital Mechanics, 2nd edition'', AIAA Education Series, p. 304.</ref> కక్ష్యాకాలం సమానంగా ఉండడం అంటే అర్థం, భూమ్మీద ఉన్న పరిశీలకునికి, భూ సమన్వయ కక్ష్యలో ఉన్న వస్తువు ప్రతి  సైడిరియల్ రోజు తరువాత అదే స్థానానికి తిరిగి వస్తుంది. ఒక రోజు సమయంలో ఆ వస్తువు ఆకాశంలో 8 అంకె ఆకారంలో ఉండే పథంలో  ప్రయాణిస్తుంది. ఈ 8 ఆకారం యొక్క లక్షణాలు - కక్ష్య యొక్క వాలు, ఎక్సెంట్రిసిటీపై ఆధారపడి ఉంటాయి. ఉపగ్రహాలను సాధారాణంగా [[తూర్పు]] దిశగా ప్రయోగిస్తారు. భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో  తిరిగే ఉపగ్రహాలు భూభ్రమణం కంటే [[వేగం]]<nowiki/>గా తిరుగుతూంటాయి కాబట్టి, భూమిపై ఉన్న పరిశీలకునికి ఇవి తూర్పు దిశగా ప్రయాణిస్తున్నట్లు  కనిపిస్తాయి. భూ సమన్వయ కక్ష్య కంటే ఆవల (దూరంగా) ఉన్న కక్ష్యలోని [[ఉపగ్రహాలు]] పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి.
 
భూ సమన్వయ కక్ష్యల్లో ఒక ప్రత్యేకత కలిగినది భూస్థిర[[భూ స్థిర కక్ష్య]]. ఇది ఒక వృత్తాకార భూసమన్వయ  కక్ష్యయే, కానీ దీని వాలు (ఇన్‌క్లినేషన్) మాత్రం సున్నా ఉంటుంది.  అంటే ఇది  సరిగ్గా భూమధ్య రేఖకు సరిగ్గా ఎదురుగా ఉంటుందన్నమాట. భూమిపై ఉన్న పరిశీలకులకు, భూ స్థిర కక్ష్యలో ఉన్న వస్తువు, ఆకాశంలో ఒకే స్థానంలో స్థిరంగా ఉన్నట్లు  కనిపిస్తుంది. భూసమంవయ కకష్యలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ భూ స్థిర కక్ష్య మాత్రం ఒక్కటే ఉంటుంది. భూ సమన్వయ, భూ స్థిర - రెంటినీ ఒకే అర్థంలో వాడడం కద్దు.<ref>C. D. Brown (1998), ''Spacecraft Mission Design, 2nd Edition,'' AIAA Education Series, p. 81</ref> కచ్చితంగా చెప్పాలంటే, భూ సమన్వయ భూ కక్ష్య, భూ సమన్వయ భూమధ్య రేఖా కక్ష్య,  భూ స్థిర కక్ష్యలను సమానార్థంలో వాడవచ్చు<ref>{{వెబ్ మూలము|url=http://www.arianespace.com/launch-services-ariane5/Ariane5_users_manual_Issue5_July2011.pdf|title=Ariane 5 User's Manual Issue 5 Revision 1|date=July 2011|work=arianespace|accessdate=28 July 2013}}</ref>. [[సమాచార ఉపగ్రహం|సమాచార ఉపగ్రహాలు]] సాధారణంగా భూస్థిర కక్ష్యలో గానీ, లేదా భూ స్థిర కక్ష్యకు దగ్గరగా గానీ ఉంటాయి. దీనివలన,  [[భూమి]]<nowiki/>పై ఉన్న యాంటెన్నాలు శాశ్వతంగా ఒకే దిశలో ఉండేలా స్థాపించవచ్చు, వాటిని పదే పదే కదిలించాల్సిన అవసరం లేదు. 
 
అర్థ సమన్వయ కక్ష్య యొక్క కక్ష్యాకాలం సగం సైడిరియల్ రోజు ఉంటుంది. భూమితో పోలిస్తే ఇది రెండింతలు ఉండడాన, అది భూమి చుట్టూ రోజుకు రెండుసార్లు తిరుగుతుంది.  [[మోల్నియా కక్ష్య]], జీపీయెస్‌ [[ఉపగ్రహాలు]]  తిరిగే కక్ష్యలు వీటికి ఉదాహరణలు.
 
== కక్ష్య లక్షణాలు ==
వృత్తాకార భూ సమన్వయ కక్ష్యల వ్యాసార్థం 42,164 కి.మీ. (భూకేంద్రం నుండి) ఉంటుంది. వృత్తాకార, దీర్ఘవృత్తాకార భూ సమన్వయ కక్ష్యలన్నిటికీ ఒకే సెమి-మేజర్ అక్షం ఉంటుంది.<ref>{{Cite book|title=Fundamentals of Astrodynamics and Applications|last=Vallado|first=David A.|publisher=Microcosm Press|year=2007|location=Hawthorne, CA|pages=31}}</ref> వాస్తవానికి, ఒకే కక్ష్యాకాలం ఉన్న కక్ష్యలన్నిటికీ ఒకే సెమి-మేజర్ అక్షం ఉంటుంది.
: <math>a=\sqrt[3]{\mu\left(\frac{P}{2\pi}\right)^2}</math>
ఈ సమీకరణంలో ''a'' సెమి-మేజర్ అక్షం, ''P'' కక్ష్యాకాలం, ''μ'' భూకేంద్రక గురుత్వ స్థిరాంకం -దీని విలువ 398,600.4418&nbsp;కి.మీ<sup>3</sup>/సె<sup>2</sup>.
పంక్తి 34:
* పరసమన్వయ కక్ష్య: భూ సమన్వయ కక్ష్యకు దగ్గరగా, దానికంటే తక్కువ ఎత్తులో ఉండే కక్ష్య. తూర్పు దిశగా స్టేషన్ కీపింగులో ఉన్న ఉపగ్రహాల కోసం దీన్ని వాడుతారు.
* [[శ్మశాన కక్ష్య]]: భూ సమన్వయ కక్ష్య కంటే పైన ఉండే కక్ష్య. వయసైపోయిన ఉపగ్రహాలను ఈ కక్ష్యలోకి చేరుస్తారు.
[[దస్త్రం:Syncom_2_side.jpg|thumb|సిన్‌కామ్‌ 2]]
 
 
== చరిత్ర ==
[[దస్త్రం:Clarke_sm.jpg|thumb|ఆర్థర్ సి క్లార్క్|173x173px]]
సమాచార ఉపగ్రహాల కోసం భూస్థిర కక్ష్యను వాడాలని ఆర్థర్ సి క్లార్క్ ప్రతిపాదించాడు.<ref>A. C. Clarke, "Extra-Terrestrial Relays", ''Wireless World'', Vol. 51, No. 10, pp. 305–308, 1945</ref> ఈ కక్ష్యను క్లార్క్ కక్ష్య అని కూడా అంటారు. ఇక్కడి కక్ష్యలన్నిటినీ కలిపి క్లార్క్ బెల్ట్  అని అంటారు.
 
భూ సమన్వయ కక్ష్యలో ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహం సిన్‌కామ్‌ 2 అయితే దానికి కదులుతూ ఉండే యాంటెన్నాలు అవసరం. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టిన మొదటి  ఉపగ్రహం సిన్‌కామ్‌ 3. అప్పటినుండి, భూస్థిర [[ఉపగ్రహాలు]] నిరంతర ఉపయోగంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా [[టీవీ]] ప్రసారాల కోసం వీటిని వాడుతున్నారు.
 
భూస్థిర ఉపగ్రహాలను [[టెలీఫోను|టెలిఫోను]] సిగ్నళ్ళకోసం కూడా వాడుతున్నారు. కానీ సిగ్నలు ప్రయాణ కాలంలో ఉండే వ్యవధానం వలన, ఫోనులో మాట్లాడుకునే వారి మధ్య అర సెకండు వరకూ అంతరం ఏర్పడుతుంది. అందుచేత ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను వాడుతున్నారు. పైగా వీటిద్వారా అధిక బ్యాండ్‌విడ్త్ లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/భూ_సమవర్తన_కక్ష్య" నుండి వెలికితీశారు