భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి లంకెలు కలిపాను
చి clean up, replaced: , మరియు → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 57:
{{ముఖ్య వ్యాసము|భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు}}
 
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ [[హిందూమతము|హిందూ]] మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, [[కృష్ణ|కృష్ణా]] [[గోదావరి|గోదావారీ]] మధ్య స్థానే...). జంబూ అంటే "[[నేరేడు]]" పండు లేదా "[[గిన్నె కాయ]]", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "[[భరతుడు]]". ఇతను [[విశ్వామిత్రుడు|విశ్వామిత్ర]], [[మేనక]]ల [[కూతురు|కుమార్తె]] అయిన [[శకుంతల]] యొక్క కుమారుడు.
 
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
పంక్తి 71:
రెండవ సహస్రాబ్ది మధ్యల, [[పోర్చుగీసు|పోర్చుగల్]], [[ఫ్రెంచి|ఫ్రాన్స్]], [[బ్రిటిషు|ఇంగ్లండు]] వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]]పై [[1857]]లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన [[ప్రథమ స్వాతంత్ర్య సమరం]]) తరువాత, భారతదేశంలోని అధిక భాగం [[బ్రిటిషు సామ్రాజ్యం]] కిందకు వచ్చింది. జాతిపిత [[మహాత్మా గాంధీ]] నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ [[భారత స్వాతంత్ర్య సమరం|స్వాతంత్ర్య సమరం]] ఫలితంగా [[1947]] [[ఆగష్టు 15]]న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. [[1950]] [[జనవరి 26]]న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
 
విభిన్న [[జాతులు]], విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – [[జాతి]], [[మతము|మత]] పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. [[1975]], [[1977]] మధ్యకాలంలో అప్పటి [[ప్రధానమంత్రి]] [[ఇందిరా గాంధీ]] విధించిన [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో మాత్రమే [[పౌర హక్కులు|పౌర హక్కులకు]] భంగం వాటిల్లింది. భారత దేశానికి [[చైనా]]తో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా [[1962]]లో [[చైనా యుద్ధం 1962|యుద్ధం]] జరిగింది. [[పాకిస్తాన్]]తో [[భారత పాకిస్తాన్ యుద్ధం 1947|1947]], [[భారత పాకిస్తాన్ యుద్ధం 1965|1965]], మరియు [[భారత పాకిస్తాన్ యుద్ధం 1971|1971]]లోను యుద్ధాలు జరిగాయి. [[అలీనోద్యమం]]లో భారతదేశం స్థాపక సభ్యురాలు. [[1974]]లో, భారత్ తన మొదటి [[అణు పరీక్ష]]ను నిర్వహించింది. [[1998]]లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. [[1991]]లో జరిగిన [[ఆర్ధిక సంస్కరణలు|ఆర్ధిక సంస్కరణల]]తో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
 
''ఇంకా చూడండి'':
పంక్తి 106:
దేశపు దక్షిణాన [[ఉష్ణ వాతావరణం]] ఉండగా, ఉత్తరాన [[సమశీతోష్ణ వాతావరణం]] నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో [[అతిశీతల వాతావరణం]] (టండ్రా) ఉంది. భారత దేశంలో [[వర్షాలు]] [[ఋతుపవనాలు]] వలన కలుగుతాయి.
 
ఇంకా చూడండి:
 
[[భారతదేశ వాతావరణం]];
పంక్తి 178:
పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ, [[ఇన్‌ఫోసిస్]].|alt=|290x290px]]
 
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన [[వ్యవసాయం]] పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు [[గనులు]], [[పెట్రోలియం]], [[వజ్రాలు]], [[సినిమా]]లు, [[జౌళి]], [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]], మరియు [[హస్త కళలు]]. భారత్ దేశపు [[పారిశ్రామికీకరణ|పారిశ్రామిక]] ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. [[అమెరికా]], [[చైనా]], [[యు.ఏ.ఇ]] మరియు [[ఐరోపా సమాఖ్య]]లు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
 
== జనాభా వివరాలు ==
{{seemain|భారత జనాభా వివరాలు}}
 
భారత దేశం, [[చైనా]] తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు – [[ముంబై]] (వెనుకటి ''బాంబే''), [[ఢిల్లీ]], [[కోల్కతా]] (వెనుకటి ''కలకత్తా''), మరియు [[చెన్నై]] (వెనుకటి ''మద్రాసు''), హైదరాబాద్
 
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 74,04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82,14% మరియు మహిళల అక్షరాస్యత 53,7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.
 
దేశంలోని 80.5% ప్రజలు [[హిందూ మతం|హిందువులై]]నప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక [[ఇస్లాం|ముస్లిము]] జనాభా ఇక్కడ ఉన్నారు (13,4%). ఇతర మతాలు: [[క్రైస్తవ మతము|క్రైస్తవులు]] (2,33%), [[సిక్కు మతము|సిక్కులు]] (1,84%), [[బౌద్ధ మతము|బౌద్ధులు]] (0,76%), [[జైన మతము|జైనులు]] (0,40%), [[యూద మతము|యూదులు]], [[జొరాస్ట్రియన్ మతము|పార్సీలు]], [[అహ్మదీయ విశ్వాసం|అహ్మదీయులు]], మరియు [[బహాయి విశ్వాసము|బహాయీలు]]. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో [[పండుగలు]] అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు [[శ్రీరామనవమి]],[[వినాయక చవితి]],[[సంక్రాంతి]],[[దీపావళి]], [[హొలీ]] మరియు [[దసరా]].
 
భారత దేశం రెండు ప్రముఖ [[భారతీయ భాషలు|భాషా కుటుంబాల]]కు జన్మస్థానం. అవి, [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్]] మరియు [[ద్రావిడ భాషలు]]. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలు [[సంస్కృతం]], [[తెలుగు]],[[కన్నడం]] మరియు [[తమిళం]]. దేశంలో మొత్తం 1652 [[భారతీయ భాషలు|మాతృ భాషలు]] ఉన్నాయి.
పంక్తి 220:
జల మార్గాలు [[రవాణా విధానం|రవాణా]] సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది.
 
ఇంకా చూడండి:
 
* భారతీయ భాషలు – మాట్లాడే ప్రజల సంఖ్య;
పంక్తి 250:
[[వరి]] అన్నం మరియు [[గోధుమ]] (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య [[ఆహారం]]. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన [[భారతీయ వంటలు]] ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. [[భారతీయ దుస్తులు|భారతీయ ఆహార్యం]] కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. [[చీర]], [[సల్వార్ కమీజ్]] స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు [[పంచె]], [[కుర్తా]] ధరిస్తారు.
 
ఇంకా చూడండి:
 
* [[భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]];
పంక్తి 260:
{{seemain|భారతదేశంలో క్రీడలు}}
 
జనాభా పరంగా రెండో పెద్ద దేశమైననూ ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం లేదు. [[ఒలింపిక్ క్రీడలు|ఒలంపిక్ క్రీడ]]లలో 8 పర్యాయాలు [[హాకీ]]లో [[బంగారం|బంగారు]] పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం చెప్పుకోదగిన ఘనత లేదు.
 
[[చదరంగం]]లో [[విశ్వనాథన్ ఆనంద్]] రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, [[టెన్నిస్]]లో [[లియాండర్ పేస్]],[[మహేష్ భూపతి]], [[సానియా మీర్జా]]లు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో [[సైన నెహవల్]] చెప్పుకోదగినది. [[భారతదేశము]] [[ఒలింపిక్ క్రీడలలో భారతదేశం|ఒలింపిక్‌ క్రీడలు]] లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]] లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. [[కబడ్డీ]]లో మాత్రం వరుసగా బంగారు [[పతకాలు]] మనమే సాధించాము.
 
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన [[కబడ్డీ]], [[ఖో-ఖో]] మరియు [[గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) ]] లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. [[చదరంగము]], [[క్యారమ్‌]], [[పోలో]], మరియు [[బ్యాడ్మింటన్‌]] మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. [[కాల్బంతి|ఫుట్‌బాల్‌ (సాకర్‌) కు]] కూడా యావత్‌ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది.
 
== జాతీయ చిహ్నాలు ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు