యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (2)
పంక్తి 25:
 
==యక్షగాన విధానాలు ==
యక్షగానాన్ని ప్రదర్శించుటలో అనేకరీతులు, పద్ధతులు ఉన్నప్పటికి, బయలాట(వీధిభాగోతం)అత్యంత జనప్రియ మైనది. బయలాట అనగా వస్త్రాలంకరణ, వేషాలంకరణ కావించుకొని వేదిక భూమిపై ఆడే ప్రదర్శన. పండుగ, సంబారాల సమయాలలో ఊరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రి అంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి [[బయలాట]] అనే పేరు రూఢి అయ్యింది. ప్రజలు మాములుగా 'ఆట ' అని వ్యవరిస్తారు. కాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయమును కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది. బయలాటలో ప్రదర్శనలలో- [[రంగస్థలం]], భాగవతారు([[గాయకుడు]]), అభినయం, చతురసంభాషణలు, నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానానికి చెందిన అన్ని ఘట్టాలు\భూమికలు కనవచ్చును. యక్షగానంలో పశ్చిమ రీతి, తూర్పు రీతి అను రెండు ప్రదర్శన రీతులు ఉన్నాయి. పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో ఉన్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట, మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణ ఉన్నది పశ్చిమ రీతి(పడవలపాయ). పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులు ఉన్నాయి ; దక్షిణ తిట్టు,తూర్పు తిట్టు,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారి ఉండవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కు లేదా యాస అని భావించవలసి ఉంది.యాస: భాషను ఒకప్రాంతంలో పలుకు విధం). ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే, [[ఉడిపి]]లో బడగు యాసలో, దక్షిణ కన్నడ, మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్శించెదరు. పాత్రధారులు ధరించు వస్త్రధారణ, అలంకరణ, నృత్యశైలిలో ఉన్న వ్యత్యాసాలకారణంగా ఇలా విభజించారు. మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
 
==తాళ మద్దలె==
తాళమద్దలె అనునది యక్షగానంలో మరొక ప్రదర్శనరీతి, విధానం. ఇది బయలాటకన్న విభిన్నమైనది. ఈపద్ధతిలో వస్త్రాలంకరణ, నృత్యం మరియు భావవ్యక్తీకరణ కనిపించవు. నేపథ్యం, భాగవతారు, మరియు ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే ఉంటారు. ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా, అర్థధారులు (కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును, ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు. బయలాటలో నృత్య, అభినయాలు ముఖ్యాంశాలు. ఇందులో సంభాషణలకు ప్రాధాన్యతను ఇస్తారు. బయలాటలో వచనమునకు పరిమితి ఉంది. తాళమద్దలెలో లేదు. తాళమద్దలెలో వచనమే ప్రాధాన్యం.
 
== ప్రముఖ యక్షగాన కళాకారులు ==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు