మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత [[ఆరుద్ర]] చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్. ఇలాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు. [[బొబ్బిలి యుద్ధం]] కాలంలో బ్రిటీష్ వారు అమరవీడు అనే సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడిచేసిన రోజుల్లో కథ ప్రారంభమవుతుంది. ఆ అమరవీడు సంస్థానపు నిధి కోసం జరిగే అన్వేషణ [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]], [[కర్నూలు]] రాజ్యాల వరకూ సాగుతుంది. ప్రతినాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను తెలుగు పట్టణాల పేర్లు కలసివచ్చేలా పెట్టారు. విదేశీ సంస్కృతిలోని నేపథ్యానికి తెలుగు వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇవి.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" /><br />
సినిమాలో [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] పోషించిన పాత్ర ప్రముఖ ఆంగ్ల కౌబాయ్ చిత్రం ''గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ'' సినిమాలోని అగ్లీ పాత్రను ఆధారం చేసుకుని తయారుచేశారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ" />
==నటీనటులు==
* కృష్ణ,
* నాగభూషణం,
* సత్యనారాయణ,
* ప్రభాకర రెడ్డి,
* విజయనిర్మల,
* జ్యోతిలక్ష్మి,
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు